సన్నగా అమ్మాయి చేతి వేళ్ళలా నాజూకుగా కనిపించే బెండకాయలంటే ఇష్టపడనివారుండరేమో. . . విందుభోజనాల నుంచీ సాధారణ భోజనం వరకూ అన్నింటా కనిపించి ముద్దుగా ఆంగ్లంలో లేడీస్ ఫింగర్ అనిపించుకుంది. దీనిలో పీచు, కాల్షియం, పొటాషియం. . . వంటి వాటితో పాటు పండ్లలో ఉన్నట్లే యాంటీ ఆక్సీడెంట్లు బెండలో అధికం. ఏంటీ ఇంత ఉపోధ్ఘాతం అనుకుంటున్నారా. . !బెండ ఆరోగ్యానికి ఎంతో అండ. ఇందుగలదు అందుగలదో అన్న సందేహం వలదు. . . ఎందెందు చూసినా అందందే కలదు అన్న చందంలో బెండ అన్ని దేశాలలో ప్రాచుర్యంలో ఉంది. అందుకే దీనిని భూగోళం అంతా పండిస్తున్నారు. దీనిలో ఉన్న పోషక విలువలు ఎలా అరోగ్యానికి ఉపయోగపడతాయో తెలుసుకుందామా. . .
బెండ తింటే తెలివి తేటలు పెరుగుతాయ్ నాన్నా. . తిను అని మన పెద్దవాళ్ళు కొసరి కొసరి బెండను తినిపిస్తారు. దానికి కారణం ఇందులో బీటాకెరోటిన్, బి-కాంప్లెక్స్, విటమిన్-సి, ఐరన్, పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు బెండలో ఎక్కువ. అవి శరీరంలోని ద్రవాలను సమతుల్యంగా ఉంచేలా చేస్తాయి. దీని వల్ల నాడీవ్యవస్థ పనితీరు బాగుంటుంది. అందుకే దీన్ని బ్రెయిన్ ఫుడ్ అని అంటారు. దీన్ని తినటం వల్ల దిప్రెషన్ తగ్గుతుంది.
గర్భిణులకు ఇది మంచి ఆరోగ్యం. శిశువు నాడీవ్యవస్ధ వృధ్ధి చెందుతుంది. ఇందులోని ఫోలిక్ ఆమ్లం చాలా ఉపయోగపడుతుంది.
కరగని పీచు ఎక్కువ. ఇది మలబధ్ధకానికి మన్చి మందు. చక్కెర వ్యాధి కూడా తగ్గుతుంది.
అధిక పీచు వల్ల దీని గ్లెయసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. అందువల్ల ఇది బరువు తగ్గేందుకు సాయపడుతుంది. ఈ పీచులోని పెక్టిన్ రక్తంలోని కొలెస్టాల్ సాతాని తగ్గిస్తుంది. అందుకే ఇది రక్తనాళాల్లో కొవ్వును కరిగిస్తుంది.
పొట్టలోని చక్కెర నిల్వల్ని పీల్చుకుంటుంది. ఇందువల్ల షుగర్ శాతాన్ని తగ్గిస్తుంది.
అల్సర్లతో బాధపడేవారు బెండ తరచూ వాడటం వల్ల అందులోని జిగురు జీర్ణకోశానికి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది.
ఇక అందం విషయానికొస్తే బెండ చాలా మంచిది. దీనిని తినటం వల్ల చర్మం మృదువుగా ఉండటంతో పాటు మొహం మీద మొటిమలు రాకుండా చేస్తుంది.
జ్వరం, డయేరియా, కడుపులోనొప్పికి బెండ రసం మంచిగా పనిచేస్తుంది. చర్మానికి మాయిశ్చరైజర్ గా కూడా పని చేస్తుంది. ఇలా గృహ వైద్యానికి బెండ అన్ని విధాలా పనిచేస్తుంది.