ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TIPS FOR BEAUTY LIPS AND SMALL LIPS EXERCISES




 1. ఒక టేబుల్ స్పూన్ పాలు, ఒక టేబుల్ స్పూన్ పాల పొడిని కుంకుమ పువ్వుతో కలిపి  ఫ్రిజ్ లో ఉంచి చల్లబడిన తర్వాత మీ పెదవులకు రాసి కాటన్ ప్యాడ్ తో శుబ్రం చేసుకోండి.

 2. ఎర్రటి గులాబీ రేకుల్ని ఒక టేబుల్  స్పూన్ పాలతో కలిపి, పాలు గులాబీ రంగులొ maareeantavaraku కలపాలి, తరువాత గులాబి రేకుల్ని, పాలని వేరుచేసి పాలని 10-15 నిమిషాలు ఫ్రిజ్లొ ఉంచాలి. తరువాత బయటకు తీసి  ఒక టేబుల్ spoon బాధం పొడిని కలిపి 10-15 నిమిషాలు పెదవులకు పట్టించాలి, తరువాత కాటన్ ప్యాడ్ తో శుబ్రం చేసుకుంటే కాంతివంతమైన తళ తళ లాడే ఎర్రటి పెదాలు మీ సొంతం అవుతాయి
 3. గులాబి రేకుల్ని పాలల్లో కలిపి ముద్దగా చేసి పెదాలకు రాసుకుంటే ఊహించని ఫలితాలు పొందవచ్చు, పాలకు బదులు Glycerine ని  కుడా ఉపయోగించవచ్చు 
 4.  ఒక స్పూన్ పాల  మీగడని బీట్రూట్ రసం లేదా దానిమ్మ రసంతో కలపండి, ఈ మిశ్రమాన్ని పగిలిన పెదాలకు పట్టిస్తే మంచి ఫలితాన్నే కాకుండా ఎర్రటి మ్రుదువైన పెదాలని సొంతం చేసుకోవచ్చు.
 5. తేనె అనేది ఎలాంటి చర్మానికైనా ఉపయోగపడుతుంది,1\2 టీ స్పూన్ తేనెను 1\2 టీ స్పూన్ నిమ్మ రసంతో కలిపి పెదాలకు పట్టిస్తే, పగుళ్ళతో జవసత్వం కోల్పోయిన  పెదాలు ఎంతో అందంగా, మ్రుదువుగా, ఎర్రటి గులాబీగా మరిపోతాయి.
 6. కొంచెం పెరుగులో టమాటా పేస్ట్ ని కలిపి పెదాలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది.

 7. మరొక ఆయుర్వేద చిట్కా ఏమిటంటే : ఎండుద్రాక్షని రాత్రంతా నీటిలొ నానపెట్టి ఉదయాన్నె ఖాళి కడుపుతో తింటే మంచి సత్ఫలితాల్ని  ఇస్తుంది.



చక్కటి పెదవుల కోసం కొన్ని లిప్స్ వ్యాయామం చిట్కాలు:

  •  విటమిన్ “ఈ” కలిగి ఉన్న లిప్ క్రీం ని రోజు నిద్ర పొయే ముందు పెదవులకు రాసుకోవాలి.
  • మీ చూపుడు వేళ్ళతొ మీ పెదవులపై ఉన్న నవ్వు రేఖా భాగాన్ని మసాజ్ చేయాలి.
  • రెండు పెదవుల చివరా మీ చూపుడు వేళ్ళతో మెల్లగా మసాజ్ చెసుకోవాలి 
  • చల్లటి కాటన్ ప్యాడ్ తో పెదాలు శుబ్రపరుచుకుని, సూర్యుడు నుంచి సైతం రక్షణ ఇచ్చే లిప్ బాం ని రాసుకుంటె మంచి ఫలితాలు లభిస్తాయి .
  • చివరిగా మరియు ఖచ్చితంగా పాటించాల్సినది, మీ పెదాలు అందంగా, ఎర్రగా, మ్రుదువుగా ఉండాలంటే చాలా తేలికైనది మరియు ఖర్చులేనిదీ ఎక్కువ శాతం మంచి నీరు తాగడం
మరికొన్ని చిట్కాలు
  • పెదాలకి కొంచెం నూనె రాసి కొన్ని గంటల వరకు ఉంచండి, రాత్రంతా ఉంచితే మరింత మంచి ఫలితాల్ని సాదించవచ్చు
  • కొబ్బరి నూనె, బాధం నూనె సమపాళ్ళలొ కలిపి పెదాలకి పట్టించి రాత్రంతా ఉంచాలి, ఇలా 2 వారాలు చేస్తే మంచి ఫలితాల్ని పొందవచ్చు.