ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

FACE YOGA TIPS IN TELUGU


ఫేస్ యోగా ( ఆకర్షణీయమైన ముఖం కోసం ) 
మన శరీరంలో అన్నిటికన్నా ముఖ్యమైన భాగం ముఖం. మనకో ప్రత్యేక గుర్తింపును ఇచ్చే ముఖాన్ని యోగా ద్వారా మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవచ్చు. దీన్ని 'ఫేస్ యోగా' అంటారు.
రోజుకో పది నిమిషాలు కేటాయిస్తే ముఖం అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. వయసును పట్టిచ్చే గీతలు, ముడతలు, నల్లమచ్చలు మాయమవుతాయి.
చెవులు : రెండు చేతుల బొటనవే ళ్లు, చూపుడు వేళ్లతో రెండు చెవులను పైనుంచి కింద వరకు, కింద నుంచి పైవరకు మసాజ్ చెయ్యాలి. తర్వాత చూపుడు వేలితో చెవి లోపల, వెనకాల మసాజ్ చెయ్యాలి. ఇలా చెయ్యటం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి తలనొప్పికి ఉపశమనం కలుగుతుంది.
కనుబొమలు : బొటనవేలితో కనుబొమల కింద భాగాన్ని పైకి లేపుతూ చూపుడువేలితో వాటి పైభాగాన్ని మసాజ్ చెయ్యాలి. ఇలా పదిసార్లు చెయ్యడం వల్ల కళ్ల చుట్టూ నల్లచారలు, ముడతలు ఏర్పడవు.
ముక్కు : చూపుడువేలితో ముక్కుపై భాగంలో ఉన్న ఎముకను పైకి నొక్కాలి. ఇలా రోజుకు పదిసార్లు చెయ్యడం వల్ల సైనస్ సమస్య తగ్గుతుంది.
దవడ పై ఎముక : చూపుడు వేలితో బుగ్గల పైభాగంలో ఉన్న ఎముకను గట్టిగా నొక్కాలి.
గడ్డం : బొటనవేలితో గట్టిగా ఒత్తుతూ పైకి లేపాలి.
పెదవులు : పెదవులు మూసి ఉంచే సాగదీస్తూ నవ్వాలి. ఇలా రోజుకు పదిసార్లు చెయ్యడం వల్ల బుగ్గలు మెరుస్తూ అందంగా తయారవుతాయి.
ఓంకారం : ఓంకారంలో అ, ఉ, మ అక్షరాలుంటాయి. పెదవులు బాగా తెరచి 'అ'కారం, పెదవులు సున్నాలా పెట్టి 'ఉ'కారం, పెదవులు మూసి 'మ'కార శబ్దం చెయ్యాలి. దీనివల్ల ముఖంలో ముడతలు తగ్గుతాయి.