ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TELUGU BHAGAWADH GITA POEMS AND ITS MEANING COLLECTION


శ్రిమద్భగవద్గీత - విశ్వరూపసందర్శన యోగము
మదనుగ్రహం పరమం గుహ్యామద్యాత్మసంజ్ఞితమ్
మత్త్వయోక్తం వచస్తేన మోహోయం విగాతోమమ !

భావము :
అర్జునుడు చెప్పుచున్నాడు. ఓ కృష్ణా నన్ను అనుగ్రహించితివి. పరమగోప్వ్యమైన ఆధ్యాత్మిక విషయములు నాకు ఉపదేశము చేసితివి. దానివలన నా అజ్ఞానము తొలగిపోయినది.

భవాస్యయౌ హి భూతానాం శృతౌ విస్తరశో మయా
త్వత్తః కమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యాయమ్ !

భావము :
ఓ కమలాక్షా ! కృష్ణా ! సమస్తప్రాణుల ఉత్పత్తి ప్రళయముళ గురించి సవిస్తరముగా చెప్పితివి. శాశ్వితమైన నీ మహిమలగుర్చి వింటిని.

ఏవమేతధ్యథార్త త్వం ఆత్మానాం పరమేశ్వర !
దృష్టమిచ్చామి తే రూపమ్ ఇశ్వరం పురుషోత్తమ !

భావము :
ఓ పరమాత్మా నివు చెప్పిన దంతయు సత్యమే. అందుకు సందేహము లేదు. కాని ఓ పురుషోత్తమా నీ జ్ఞాన, ఐశ్వర్య, శక్తి, బల, వీర్య, తెజోమహితమైన, ఈ షడ్గుణైశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షముగా చూచుటకు కుతూహలంగా ఉన్నది.