ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HOW TO INCREASE HEALTH RESISTENCE POWER IN OUR BODY - TIPS FOR MAINTAINING GOOD RESISTENCE POWER IN OUR BODY


వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ)
ఇట్టే పెరుగుతుంది.....!

శరీరం పలురోగాల పాలయ్యాక డాక్టర్ల చుట్టూ తిరగడమే గానీ, రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నాలెప్పుడూ చేయం. దీని వల్ల ఆర్థికంగా నష్టమే కాదు. అమూల్యమైన కాలమూ వృధా అవుతుంది.. ఇంతకూ వ్యాధి నిరోధక శక్తి ఎందుకు తగ్గుతుంది? అందుకు కారణాలు అనేకం. చిత్రమేమిటంటే, పోషక పదార్థాల మాట అలా ఉంచి ఏ ఖర్చూ లేకుండానే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే అవకాశాలను కూడా మనం జారవిడుచుకుంటాం. ఉదాహరణకు నిద్ర, నీరు, గాలి. వీటికి ఖర్చేమవుతుంది? శరీరంలో ఆక్సీజన్‌ పరిమాణం తగ్గినా, నీటి శాతం తగ్గినా, అవసరమైనన్ని గంటలు నిద్రించకపోయినా వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. అవసరమైనన్ని గంటలు నిద్రించకపోతే, ఎంతటి బలవర్ధక ఆహారం తీసుకున్నా అవేవీ శరీరానికి శక్తిని ఇవ్వలేవు. అలాగే మనం తీసుకున్న పోషకాలు శరీరంలోని సప్తధాతువులకూ చేరాలంటే వాటికి వాహికగా శరీరంలో అవసరమైన నిష్పత్తిలో నీరుండాలి. రోజూ ఐదారు లీటర్ల నీళ్లు తాగడానికి బదులు అందులో సగమే తీసుకుంటే ఏమవుతుంది? శరీర సమస్త కణజాలాలన్నిటికీ పోషకాలు అందకపోవడమే కాకుండా జీవక్రియలన్నీ కుంటుపడతాయి. ఈ లోపం ఏ వ్యాధి రావడానికైనా దారి తీస్తుంది.

వాతావరణంలో సహజంగా 35 శాతం దాకా ఉండాల్సిన ఆక్సీజన్‌ ఇప్పుడు 15 శాతానికి పడిపోయింది. ఈ స్థితిలో ప్రాణాయామం తప్పని సరి అవుతోంది. అందుకు రోజూ ఓ అరగంట వ్యాయామం, ఓ 15 నిమిషాలు ప్రాణాయామం చేస్తే సరిపోతుంది. కానీ, 90 శాతం మంది ఆ పని చేయడం లేదు. అదేమంటే తినే ఆహార పదార్థాలు, పీల్చే గాలీ అన్నీ కలుషిత మైపోయాయి. ఈ స్థితిలో ఏం చేస్తే మాత్రం ఏం ఒరుగుతుంది? అంటూ తమ బద్దకాన్ని కప్పిపుచ్చుకుంటారు. కలుషిత ఆహారాన్ని తీసుకున్నా, వాటిలోని మంచిని గ్రహించి, చెడును విసర్జించే శక్తి శరీరానికి సహజంగానే ఉంటుంది. కాకపోతే శరీరానికి అవసరమైనంత శ్రమ లేదా వ్యాయామం ఉండాలి. ఆ శ్రమే లేకపోతే, ఆహారంలోని మంచిని సరిగ్గా గ్రహించలేకపోగా, చెడుకు బలైపోతుంది.

ఒత్తిళ్లతోనూ నష్టమే.....!

కారణం ఏదైనా కావచ్చు. మానసిక ఒత్తిళ్లు శరీర వ్యవస్థను బాగా దెబ్బ తీస్తాయి. ఒత్తిళ్లు తీవ్రమైనప్పుడు నాడీ వ్యవ స్థ అడ్రినలిన్‌, నార్‌-అడ్రినలిన్‌ అనే రసాయనాలను విడుదల చేస్తుంది. మనసు ఒత్తిడికి గురవుతోందీ అంటే, ఏదో ఘర్షణ ఉందని, శరీరానికి అదనపు శక్తి అవసరమవుతుందని భావించి శరీరం ఈ హార్మోన్లను విడుదల చే స్తుంది. ఆ వెనువెంటనే గుండె వేగం, రక్తపోటు పెరుగుతాయి. అదనపు శక్తి కోసం గ్లూకోజ్‌ సాధారణ పరిమాణం కన్నా మించి విడుదల అవుతుంది. ఇది శరీర శ్రమకు సంబంధించినది కాకపోవడం వల్ల అదనంగా విడుదల అయిన గ్లూకోజ్‌ శరీరంలోనే నిలిచిపోతుంది. అంతిమంగా ఇది మధుమేహానికి దారి తీస్తుంది. వీటన్నిటికీ విరుగుడు శరీర శ్రమ, యోగ, ప్రాణాయామాలే. వ్యాయామాలు శరీర వ్యవస్థను బలోపేతం చేయడమే కాదు మానసిక ఒత్తిళ్లను తట్టుకునే శక్తిని కూడా పెంచుతాయి.

ఆహారంలో భిన్నత్వం

* ప్రతి ఆహార పదార్థంలోనూ పోషకాలు ఉంటాయి కానీ, ప్రతి దాంట్లోనూ అన్ని రకాల పోషకాలు ఉండవు. అందుకే పండ్లు, కూరగాయల్ని రోజుకో రకం తీసుకోవడం ఉత్తమం. పైగా రోజూ ఒకే రకమైన ఆహార పదార్థాలను తీసుకుంటే శరీరం వాటిలోని పోషకాలను గ్రహించడం పట్ల ఆసక్తి చూపదు.

* కేవలం విటమిన్లు ఉన్న ఆహార పదార్థాలకే పరిమితం కాకుండా, వ్యాధులతో పోరాడేందుకు తోడ్పడే ఫైటో కెమికల్స్‌ ఉన్న పదార్థాలకు ప్రాముఖ్యతనివ్వాలి.

* లవణాలు ప్రత్యేకించి జింకు, ఐరన్‌, కాపర్‌ ఉండే ఆహార పదార్థాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. ముడి ధాన్యాల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి.

* రోజుకు కనీసం 40 గ్రాముల పీచు పదార్థాలు అందే ఆహార పదార్థాలకు ప్రాధాన్యతనివ్వాలి. పీచుపదార్థాలు లోపిస్తే మలినాలు శరీరంలోనే నిలిచిపోయి జీవక్రియలు కుంటుపడిపోయే పరిస్థితికి ఏర్పడుతుంది. అంతిమంగా ఇది వ్యాధినిరోధక శక్తిని దెబ్బతీస్తుంది.
ఫ నాడీ వ్యవస్థ పోషణకు కొవ్వు పదార్థాలు కూడా అసవరమే. కాకపోతే అవి ఆహారంలో 20 శాతానికి మించకూడదు.

* తీపి పదార్థాల్లో మెదడును చైతన్యపరిచే గుణం ఉంది. అయితే అతిగా తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గే ప్రమాదం కూడా ఉంది. అందుకే చాలా పరిమితంగానే తీసుకోవాలి.

ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు శరీరంలో వ్యాధినిరోధక శక్తిని గణనీయంగా పెంచుతాయి. నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండేలా చేస్తాయి.