ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

WHAT IS AVATHAR - INFORMATION ABOUT HINDU GOD'S AVATHARS IN TELUGU AND ENGLISH


అవతారం

అవతారం అనగా దిగుట, పైనుండి క్రిందికి వచ్చుట. దేవుడు మనుష్యాది రూపాలను ఎత్తటం అవతారమంటారు. దేవుడు అవతారమెత్తడం అనగా పైనుండు దేవుడు లోక క్షేమము కొరకు భూలోకం వచ్చెనని అర్ధం.
ప్రపంచమందు అధర్మం ఎక్కువైనపుడు చెడ్డవాళ్లను శిక్షించటానికి, మంచి వాళ్లని రక్షించటానికి భగవంతుడు పశుపక్షిమనుష్యాది రూపాలలో భూమిపైన అవతరించునని అనేక మతాలవారి నమ్మకం. విష్ణువు మత్స్యకూర్మాది అవతారాలు ఎత్తెనని హిందువులు, పరమ విజ్ఞానము బుద్ధుడుగానూ, బోధిసత్వులుగానూ అవతారమెత్తిందని బౌద్ధులు, ఈశ్వరుని రెండవ అంశ అయిన పుత్రుడు యేసు రూపములో అవతరించెనని క్రైస్తవులు భావిస్తారు.
ఈ కల్పనలన్నింటికీ దేవుడు మానవులకు ఉపకారము చేయాలంటే భౌతిక రూపం ధరించడం అవసరం అన్న కల్పన ఆధారం. ప్రజలు అనేక విధాల ఆపదలు వచ్చినప్పుడు భగవంతుండు వారి ఆపదలను తొలగించుటకు భౌతికరూపం ధరించుననే నమ్మకం అవతారకల్పనకు మూలాధారం. ప్రజలకు దుష్టులచే ఆపద కలిగినప్పుడు ఇంద్రాది దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకోవటం. ఆయన వాళ్లకు అభయమిచ్చి పంపటం, సరైన సమయం చూసుకొని భౌతిక రూపంలో భూమిపై అవతరించి దుష్టశిక్షణ చేయటం చాలామటుకు అవతారకథల ప్రధాన ఇతివృత్తం.
విష్ణువు
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||
హిందూ మత సంప్రదాయంలో త్రిమూర్తులుగా కొలువబడే ముగ్గురు ప్రధాన దేవుళ్ళలో విష్ణువు ఒకడు. బ్రహ్మను సృష్టికర్తగాను, విష్ణువును సృష్టి పాలకునిగాను, శివుని సృష్టి నాశకునిగాను భావిస్తారు. శ్రీవైష్ణవం సంప్రదాయంలో విష్ణువు లేదా శ్రీమన్నారాయణుడు సర్వలోకైకనాధుడు, పరబ్రహ్మము, సర్వేశ్వరుడు. శంకరాచార్యుని పంచాయతన విధానాన్ని అనుసరించే స్మార్తుల ప్రకారం విష్ణువు ఐదు ముఖ్యదేవతలలో ఒకడు.[1] యజుర్వేదం, ఋగ్వేదం, భాగవతం, భగవద్గీత వంటి సనాతన ధార్మిక గ్రంధాలు నారాయణుడే పరమదైవమని కీర్తిస్తున్నాయి.[2][3][4][5][6]
విష్ణు సహస్రనామ స్తోత్రం[7]లో విష్ణువే పరమాత్ముడని, పరమేశ్వరుడని, విశ్వరూపుడని, కాలాతీతుడని, సృష్టి స్థితి లయాధిపతియని, దేవదేవుడని కీర్తించింది. పురాణాలలో విష్ణువు వర్ణన ఇలా ఉంటుంది - నీలమేఘశ్యామవర్ణం కలవాడు, చతుర్భుజుడు, పంచాయుధములు ధరించినవాడు, పాల సముద్రంలో శేషునిపై పవళించినవాడు, శ్రీదేవి, భూదేవిలచే కొలువబడుచున్నవాడు, శ్రీవత్సచిహ్నమును, కౌస్తుభమును, వైజయంతీ మాలను ధరించినవాడు, గరుడునిపై ప్రయాణించువాడు. [8]
యుగయుగాలలో లోక పాలనకై, ధర్మ సంస్థాపనకై విష్ణువు అవతరిస్తాడు. అలాంటి అనేక అవతారాలలో దశావతారములు ప్రసిద్ధములు. ముఖ్యముగా నరసింహస్వామి, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి వంటి అవతారాలలో విష్ణువు పూజింపబడుతాడు.[9][10]

విశ్వం, విష్ణుః వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః
"విష్" అనే ధాతువునుండి "విష్ణు" అనే పదానికి భాష్యకారులు అర్ధం చెబుతారు. "విష్" అంటే సర్వత్ర వ్యాపించి ఉండుట, అంతటినీ ఆవరించి ఉండుట అనే అర్ధాలున్నాయి. విష్ణు సహస్రనామ స్తోత్రం మొదటి శ్లోకంలో "విశ్వం, విష్ణుః, వషట్కారః, భూత భవ్య భవత్ప్రభుః, భూతకృత్, భూతభృత్, భావః, భూతాత్మా, భూత భావనః" అనే నామాలున్నాయి. "యద్ విషితో భవతి తద్ విష్ణుర్భవతి" - అంతటా ప్రవేశించి ఉండేవాడు విష్ణువు - అని నిరుక్తి అర్ధం. "వేవేష్టి ఇతి విష్ణుః" అని శంకరాచార్యుల వ్యాఖ్యానం. "విశ్వం" అంటే అంతా తానైనవాడు. "విష్ణువు" అంటే అన్నియెడలా ఉండేవాడు. "భూత భవ్య భవత్‌ప్రభుః" అంటే గడచిన కాలానికి, జరుగుతున్న కాలానికి, రాబోయే కాలానికి కూడా ప్రభువు. భూత కృత, భూత భృత్, భావః, భూతాత్మా, భూత భావనః అంటే అన్ని భూతాలను (జీవులను) సృష్టించి, పోషించి, భరించేవాడు. అన్ని జీవులలోను ఉండేవాడు. ఈ నామ పదాలు హిందూ సంప్రదాయంలో విష్ణువుకు ఉన్న స్థానాన్ని క్లుప్తంగా చెబుతున్నాయనుకోవచ్చును. అనగా విష్ణువు కాలానికి, స్థలానికి, పదార్ధానికి అతీతుడు.(He is not limited by space, time or substance.)[11]
భాగవతం గజేంద్ర మోక్షం ఘట్టంలో గజేంద్రుని ప్రార్ధన (నిరాకార) పరబ్రహ్మమును ఉద్దేశించి చేసినట్లు కనిపిస్తుంది. కాని విష్ణువు ఆ మొర ఆలకించి గజరాజును రక్షించడానికి పరుగున వచ్చాడు. అనగా ఆ ప్రార్ధనలో చెప్పిన లక్షణాలు విష్ణువుకు అన్వయిస్తాయనుకోవచ్చును - అవి -
జగం ఎవనిచే జనిస్తుంది? ఎవ్వనిలో ఉంటుంది? ఎవ్వనిలో అంతమవుతుంది?
పరమేశ్వరుడు (అందరికీ దేవుడు) ఎవ్వడు?
అంతటికీ మూలం ఎవ్వడు?
మొదలు, మధ్య, తుది లేనివాడు (అనంత మూర్తి) ఎవ్వడు?
అంతా తానైనవాడెవ్వడు?
ఆత్మ భవుడు (తనంత తానే జనించినవాడు),
అయితే సామాన్య పూజాదిక సంప్రదాయాలలోను, విశేషించి శ్రీవైష్ణవ సిద్ధాంతాలలోను శ్రీమన్నారాయణుడు వైకుంఠవాసుడు, శేష శయనుడు, శ్రీలక్ష్మీ సమేతుడు, నీలమేఘ శ్యాముడు, పరిపూర్ణుడు అయిన పురుషోత్తమునిగా ఆరాధింపబడుతాడు.
నాలుగు వేదాలు హిందూమతానికి మూలగ్రంధాలని చెప్పవచ్చును. వీటిలో అన్నింటికంటే పురాతనమైనదని భావించే ఋగ్వేదంలో విష్ణువును స్తుతిస్తూ ఐదు సూక్తులు ఉన్నాయి. ఇవి కాక ఇంకొక సూక్తంలో కొంతభాగం విష్ణువును గురించి ఉంది. వేదాలలో విష్ణువును గురించి మూడు ముఖ్యలక్షణాలు తరచు ప్రస్తావింపబడినాయి - (1) మూడు పెద్ద అంగలు వేసినవాడు (త్రివిక్రముడు). మూడు అడుగులతో లోకాలను ఆక్రమించినవాడు (2) పెద్ద శరీరం కలిగినవాడు (వరాహమూర్తి). జగత్తంతా వ్యాపించి ఉంటాడు. (3) యువకుడు, నవ యవ్వనుడు. ఇంకా విష్ణువు తన గుర్రాలను (రోజులను) వాటి ఆరు పేర్లతో (ఋతువులతో) చక్రాన్ని తిప్పినట్లు కదల్చాడని చెప్పబడింది. విష్ణువు స్వభావంలో మరొక ముఖ్యాంశం ఇంద్రునితో స్నేహం. వృత్రాసురునితో యుద్ధం చేసేటపుడు, అనంతర రాక్షస సంహారంలోను ఇంద్రునికి విష్ణువు సహకరించాడు. [12].
ఒక వివరణ ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య అనేక యుద్ధాలు జరుగుతుండేవి. దేవతలు ఓడిపోయినా గాని ఏదో ఒక ఉపాయం వలన చివరికినెగ్గుకొచ్చేవారు అని ఐతరేయ బ్రాహ్మణములో ఉంది. శతపథ బ్రాహ్మణములో ఒక కథ ప్రకారం యుద్ధానంతరం విష్ణువు మూడడుగులలో ఆక్రమించే భూమిని దేవతలకు ఇచ్చేలా రాక్షసులు ఒప్పందం చేసుకొన్నారు. అప్పుడు విష్ణువు లోకాలను, వేదాలను, వాక్కును తన మూడడుగులతో ఆక్రమించాడు. అదే వామనావతారము. శతపథ బ్రాహ్మణములో "ఏమూష" అనే పేరుగల వరాహం భూమిని నీటినుండి పైకి ఎత్తింది అని చెప్పబడింది. తైత్తరీయ సంహితలో ఆ వరాహమే ప్రజాపతి అవతారమని ఉంది. అదే వరాహావతారము. శతపథ బ్రాహ్మణములో మనువును ప్రళయంనుండి ఒక చేప కాపాడుతుంది అని ఉంది. అదే మత్స్యావతారము. ప్రజాపతి నీటిలో తిరిగే తాబేలుగా మారాడు. అదే కూర్మావతారము. యజ్ఞో వై విష్ణుః - అనగా యజ్ఞము విష్ణు స్వరూపము - అని వేదంలో చెప్పబడింది. [12]
కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన నారాయణోపనిషత్తులో ఇలా ఉంది -
ఓం. అథ పురుషో హ వై నారాయణోఽ కామయత, ప్రజాః సృజయేతి, నారాయణాత్ప్రాణో జాయతే, మనస్సర్వేంద్రియాణిచ, ఖం వాయుర్జ్యోతి రాపః, పృథివీ విశ్వస్య ధారిణీ, నారాయణాద్బ్రహ్మాజాయతే.... .... -- సృష్టి ప్రారంభంలో పరమపురుషుడైన నారాయణుడు మాత్రమే ఉన్నాడు. అతడు సృష్టి చేయాలనుకొన్నాడు. అప్పుడు నారాయణుని శరీరంనుండి హిరణ్యగర్భుడు పుట్టాడు.. ...
ఋగ్వేదంలో ఇలా ఉంది -
అథ నిత్యో నారాయణః, బ్రహ్మో నారాయణః, శక్రశ్చ నారాయణః, ద్యావా పృథివ్యౌచ నారాయణః, కాలశ్చ నారాయణః, దిశశ్చ నారాయణః, ఊర్ధ్వంచ నారాయణః, అధశ్చ నారాయణః, అంతర్బహిశ్చ నారాయణః,నారాయణ ఏవేదగ్‌ం సర్వం, యద్భూతం యచ్చభవ్యం, నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో, నిరాఖ్యాతశ్శుద్ధో దేవ ఏకో నారాయణః,న ద్వితీయోఽస్తి కశ్చిత్, య ఏవం వేదస విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి, ఏతద్యజుర్వేద శిరోఽధీతే -- నారాయణుడే సత్యము, నిత్యము, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, భూమి, ఆకాశము, పైన, క్రింద, అన్నిదిశలు, బయట, లోపల అన్నీ నారాయణుడే. అతడే భూత భవిష్యద్వర్తమానాలు. అతడు నిష్కళంకుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు. నారాయణుని మాటలతో నిర్వచింపలేము..
విశిష్టాద్వైత ప్రవర్తకుడైన రామానుజాచార్యుడు క్రీ.శ. 1017లో జన్మించాడు. 1049లో సన్యాసం స్వీకరించాడు. విశిష్టాద్వైతం లేదా శ్రీవైష్ణవం ప్రకారం భగవంతుడు ఒక్కడే. అతడు సాకారుడు. అతడే నారాయణుడు. నిత్యానపాయిని అయిన లక్ష్మీదేవి నారాయణునినుండి వేరు కాదు. నిర్మలజ్ఞానానంద స్వరూపుడు. ఆ దేవదేవుడొక్కడే స్వతంత్రుడు. జీవి, ప్రకృతి పరతంత్రులు. పరమాత్మ నుండి ఆత్మ జన్మిస్తుంది. జీవాత్మ పరమాత్మ సన్నిధి చేరడమే మోక్షం. మోక్షానికి సాధనం అచంచలమైన విష్ణుభక్తి. భక్తితో పాటు ప్రపత్తి, అనగా మనసా వాచా కర్మణా భగవంతుని శరణాగతి పొందడం కూడా అత్యవసరం. మానవులందరూ సమానులు. మోక్షానికి అందరూ అర్హులు. కుల లింగ విచక్షణ లేకుండా లక్ష్మీనారాయణులను పూజించి చక్రాంకితాలు చేయించుకొని, మంత్రోపదేశం పొంది ఊర్ధ్వపుండ్ర ధారణ చేసినవారందరూ శ్రీవైష్ణవులే.[12]
నారాయణుడే సృష్టి స్థితి లయాలకు మూలము. చిత్తు జీవుడు. అచిత్తు ప్రకృతి. ఇవి రెండూ ఆయన శరీరము. సూక్ష్మ చిదచిద్విశిష్టుడుగా ఉన్న పరమేశ్వరుడు స్థూల చిదచిద్విశిష్టుడు కావడమే సృష్టి. ప్రకృతి మూలంగానే ఈ జగత్తు అంతా సృజింపబడుతున్నది. శ్రీ మహావిష్ణువు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే చతుర్వ్యూహాలు దాల్చుతాడు. వాసుదేవుడు తన భక్తులపట్ల వాత్సల్యంతో ఐదు మూర్తులుగా గోచరిస్తాడు. అవి
అర్చావతారము - దేవాలయాలలోని ప్రతిమలు
విభవావతారములు - రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు.
వ్యూహావతారములు - వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలు.
సూక్ష్మావతారము - సంపూర్ణ షడ్గుణ సంపన్న పరబ్రహ్మము.
అంతర్యామి - సకల జీవనాయకుడు.
భగవంతుని అనుగ్రహానికి భక్తి ప్రపత్తులు ముఖ్యం. అందుకు ఉపాసనా విధానాలు - (1) అభిగమనము (2) ఉపాదానము (3) ఇజ్యము (4) స్వాధ్యాయము (5) యోగము
ఏకవింశతి అవతారములు
లోకపాలనకై విష్ణువు ధరించిన 21 అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు
మహాభాగవతం ప్రధమ స్కంధంలో ఈ 21 అవతారాల గురించి క్లుప్తంగా చెప్పబడింది. తరువాత వివిధ స్కంధాలలో ఆయా అవతారాల గాధలు వివరంగా తెలుపబడ్డాయి. అవతారాలు లీలావతారాలు, అంశావతారాలు, పూర్ణావతారాలు అని వివిధ వర్ణనలతో ప్రస్తావించబడుతాయి. ఆయా అవతారంలో భగవంతుడొనర్చిన కార్యం లేదా ప్రదర్శించిన అంశనుబట్టి ఈ విభాగం చెప్పబడుతుంది.
శౌనకాది మహర్షులకు సూత మహర్షి ఇలా చెప్పాడు - అన్ని అవతారాలకు ఆది అయిన శ్రీమన్నారాయణుడు పరమ యోగీంద్రులకు దర్శనీయుడు. ఈ అవతారాన్ని విరాడ్రూపమనీ అంటున్నారు. సకల సృష్టికీ, అవతారాలకూ ఈ మూర్తియే మూలం, అవ్యయం, నిత్యం, శాశ్వతం.
బ్రహ్మ అవతారము: దేవదేవుడు కౌమార నామంతో అవతరించి బ్రహ్మణ్యుడై దుష్కరమైన బ్రహ్మచర్యం పాటించాడు.
వరాహ అవతారము: రసాతలంలోకి కృంగిపోయిన భూమిని యజ్ఞవరాహమూర్తియై ఉద్ధరించి సృష్టి కార్యాన్ని సానుకూలం చేశాడు.
నారద అవతారము: దేవ ఋషియైన నారదునిగా అవతరించి సమస్త కర్మలనుండి విముక్తిని ప్రసాదించే పాంచరాత్రమనే వైష్ణవతంత్రాన్ని తెలియజేశాడు.
నర నారాయణ అవతారము: ధర్ముని పత్నియందు నరనారాయణ రూపంలో అవతరించి అనన్యసాధ్యమైన తపమును ఆచరించాడు. స్వానుష్టానపూర్వకంగా శమదమాల తత్వాన్ని లోకానికి ఉపదేశించాడు.
కపిల అవతారము: నరనారాయణులు బోధించిన తత్వం కాలగర్భంలో కలిసిపోయింది. అపుడు దేవదేవుడు కపిలుడనే సిద్ధునిగా అవతరించి అసురి అనే బ్రాహ్మణునకు తత్వ విర్ణయం కావించగల సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు.
దత్తాత్రేయ అవతారము: భగవానుడు అత్రి అనసూయా దంపతులకు పుత్రుడై జన్మించి దత్తాత్రేయునిగా ప్రసిద్ధుడయ్యాడు. అలర్క మహారాజుకు, మరికొందరు బ్రహ్మవాదులకూ ఆత్మవిద్యను బోధించి ఆశాస్త్రాన్ని ఉద్ధరించాడు. జీవాత్మ, పరమాత్మల తత్వాన్ని వివరించే ఆ తత్వవిద్యకు "అన్వీక్షకి" అని పేరు.
యజ్ఞుడుయజ్ఞ అవతారము: భగవంతుడు రుచి మహర్షికి ఆకూడి కడుపున యజ్ఞుడనే పేరుతో జన్మించాడు. యమాది దేవతలతో కలిసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు.
ఋషభ అవతారము: భగవానుడు అగ్నీధ్రుని కొడుకు నాభికి మేరు దేవియందు జన్మించి (ఉరుక్రముడనే పేరుతో ప్రసిద్ధుడై?) విద్వాంసులైనవారికి సర్వాశ్రమ పూజితమైన పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు.
పృధు అవతారము: పృథువు అనే చక్రవర్తిగా ధేనురూపం ధరించిన భూమినుండి ఓషధులను పితికి లోకాలను పోషించాడు. ఆహార యోగ్యాలయిన సస్యాదులను, ఓషధులను భూమిమీద మొలిపించాడు. ఋషులకు సంతోషం కలిగించాడు.
మత్స్య అవతారము: చాక్షుష మన్వంతరం సమయంలో ప్రళయకాలంలో మహామీనావతారుడై వైవస్వత మనువును, ఓషధులను, జనులను ఆ నావ ఎక్కించి ఉద్ధరించాడు.
కూర్మ అవతారము: దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా మునిగిపోతున్న మందరగిరిని ఉద్ధరించాడు.
ధన్వంతరీ అవతారము: అమృత కలశాన్ని ధరించి వచ్చినవారికి అందించాడు.
మోహినీ అవతారము: జగన్మోహినియై అమృతం దేవతలకు మాత్రం అందేలా చేశాడు.
వరాహావతారం:వరాహావతారం హిరణ్యక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము .రాక్షసునితో భయంకరంగా యుద్దం చేసి, చక్రాయుధంతో వానిని సంహరించి, భూమాతని జలము పై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసుల బారినుండి రక్షించిన స్వామి.
నృసింహ అవతారము: లోకకంటకుడైన హిరణ్యకశిపుని సంహరించడానికి, భక్తుడైన ప్రహ్లాదుని కాచుటకు శ్రీనారసింహమూర్తియై ఉక్కు స్తంభం నుండి బయలువెడలినాడు.
వామన అవతారము: కపట వామనమూర్తియై బలిచక్రవర్తినుండి మూడడుగుల నేలను యాచించి, త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.
పరశురామ అవతారము: మదోన్మత్తులై, బ్రాహ్మణ ద్రోహులైన క్షత్రియులపై ఇరవైఒక్కమారులు దండెత్తి వారిని దండించాడు.
వ్యాస అవతారము: కృష్ణ ద్వైపాయనుడై ఒక్కటిగా ఉన్న వేదరాశిని విభజించాడు.
రామ అవతారము: పురుషోత్తముడైన శ్రీరాముడై రావణసంహారం కావించాడు.
బలరామ అవతారము, కృష్ణ అవతారము: బలరామ కృష్ణులుగా ఒకేమారు అవతరించి దుష్ట సంహారం కావించి భగవద్గీతను ప్రసాదించాడు.
బుద్ధ అవతారము: కలియుగాది సమయంలో కీకటదేశంలో బుద్ధనామంతో జన్మించి జనులకు జ్ఞానాన్ని ఉపదేశించాడు.
కల్కి అవతారము: కలియుగాంతంలో రాజులు చోరప్రాయులై వర్తిస్తుండగా విష్ణుయశుడనే విప్రునికి కల్కి నామధేయుడై జన్మించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయగలడు.
భాగవతం రెండవ స్కంధంలో భగవంతుని లీలావతారాలు అనేకమనీ, వాటిలో కొన్ని సుందరమైన అవతారాలను తాను చెబుతున్నాననీ క్రింది అవతారాలు చెప్పబడ్డాయి.
వరాహావతారం - భూసముద్ధరణం
సుయజ్ఞావతారం - లోకపీడాపహరణం
కపిలావతారం - బ్రహ్మవిద్యా ప్రతిపాదనం
దత్తాత్రేయావతారం - మహిమా నిరూపణం
సనకాద్యవతారం (సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులు) - బ్రహ్మవిద్యా సముద్ధరణం
నరనారాయణావతారం - కామజయం
ధ్రువావతారం - ధ్రువపదారోహం
పృథురాజావతారం - అన్నసమృద్ధికరణం
ఋషభావతారం - పరమహంస మార్గోపదేశం
హయగ్రీవావతారం - వేదజననం
మత్స్యావతారం - వేద సంగ్రహం
కూర్మావతారం - మందర ధారణం
ఆదిమూలావతారం - గజేంద్ర రక్షణం
వామనావతారం - బలిరాజ యశోరక్షణం
హంసావతారం - భాగవత యోగోపదేశం
మన్వవతారం - మనువంశ ప్రతిష్ఠాపనం
పరశురామావతారం - దుష్టరాజ భంజనం
రామావతారం - రాక్షస సంహారం
కృష్ణావతారం - లోకకళ్యాణం
వ్యాసావతారం - వేద విభజనం
బుద్ధవతారం - పాషండ ధర్మ ప్రచారం
కల్క్యవతారం - ధర్మ సంస్థాపనం
Avatar
In Hinduism, an avatar /ˈævətɑr/ (Hindustani: [əʋˈt̪aːr], from Sanskrit अवतार avatāra "descent") is a deliberate descent of a deity to Earth, or a descent of the Supreme Being (e.g., Vishnu for Vaishnavites), and is mostly translated into English as "incarnation", but more accurately as "appearance" or "manifestation".[1][2]
The phenomenon of an avatar is observed in Hinduism,[3] Ayyavazhi, and Sikhism. Avatar is regarded as one of the core principles of Hinduism.[4]
The term is most often associated with Vishnu, though it has also come to be associated with other deities.[5] Varying lists of avatars of Vishnu appear in Hindu scriptures, including the ten Dashavatara of the Garuda Purana and the twenty-two avatars in the Bhagavata Purana, though the latter adds that the incarnations of Vishnu are innumerable.[6] The avatars of Vishnu are a primary component of Vaishnavism. An early reference to avatar, and to avatar doctrine, is in the Bhagavad Gita.[7]
Shiva and Ganesha are also described as descending in the form of avatars. The various manifestations of Devi, the Divine Mother principal in Hinduism, are also described as avatars or incarnations by some scholars and followers of Shaktism.[7][8] The avatars of Vishnu carry a greater theological prominence than those of other deities, which some scholars perceive to be imitative of the Vishnu avatar lists.
In Sikhism, an avatar is a deliberate descent of a soul to earth in any form.[9] Guru Granth Sahib believes in the existence of the Dashavatara. In Dasam Granth, Guru Gobind Singh wrote three composition on historical avatars which include Vishnu Avatar, Brahma Avatar, and Rudra Avatar.[10]
The Sanskrit noun avatāra is derived from the verbal root tṝ "to cross over", joined with the prefix ava "off, away, down". The word does not occur in the Vedas, but is recorded in Pāṇini (3.3.120). Avatāra was initially used to describe different deities, then around the 6th century AD it began to be used primarily to describe the manifestations of Vishnu.[11] While earlier texts mention deities taking on different forms, the Bhagavad Gita (4.5-9) is the first text to discuss the doctrine associated with the term even though the word avatāra itself is not mentioned.[12]
According to some scholars like Mercy Oduyoye, H. M. Vroom, and Noel Sheth, the common translation "incarnation" is somewhat misleading as the concept of an avatar corresponds more closely to the view of Docetism in Christian theology, as different from the idea of God 'in the flesh' in mainstream Christology.[13][14]
The concept of avatar within Hinduism is most often associated with Vishnu, the preserver or sustainer aspect of God within the Hindu Trinity or Trimurti or the one and only supreme God for followers of Vaishnavism.
Vishnu's avatars typically descend for a very specific purpose. An oft-quoted passage from the Bhagavad Gita describes the typical role of an avatar of Vishnu—as bringing dharma, or righteousness, back to the social and cosmic order:[1][5]
“ Whenever righteousness wanes and unrighteousness increases I send myself forth.
For the protection of the good and for the destruction of evil,
and for the establishment of righteousness,
I come into being age after age. (Gita:4.7–8)
The descents of Vishnu are also integral to His teaching and tradition, whereas the accounts of other deities are not so strictly dependent on their avatar stories. Although it is usual to speak of Vishnu as the source of the avatars, within the Vaishnavism branch of Hinduism Narayana, Vasudeva, and Krishna are also seen as names denoting divine aspects which descend as avatars.[1]
The Bhagavata Purana describes Vishnu's avatars as innumerable, though there are ten incarnations (Dashavatara), that are widely seen as his major appearances.[1][6] Krishna and Rama are the two mostly widely known and worshiped avatars of Vishnu, with their stories told in the two major Sanskrit epics, the Mahabharata and the Ramayana.[15] Different lists of Vishnu's avatars appear in different texts, including: the dasavatara from the Garuda Purana; lists of twenty-two, twenty-three, and sixteen avatars in the Bhagavata Purana;[16] thirty-nine avatars in the Pañcaratra[17] the dasavatara again in Agni Purana; the first eight of the dasavatara in Padma Purana. The commonly accepted number of ten was fixed well before the 10th century CE.[16] In addition, various Vaishnava saints and founders are considered to be partial avatars.[18]
The various avatars categorized in many different ways. For example: Purusavatara is the first avatara; Gunavataras are represented by the Trimurti (Brahma, Vishnu, and Shiva) who each preside over one of the Guṇas (rajas, sattva, and tamas); Lilavataras are the well-known ones, and include Avesavataras (beings into whom part of God Himself has entered) and saktyamsavesa (into whom only parts of His power enter); Kalpa-, Manvantara-, and Yuga-avataras descend during different cosmic ages.[19] Some Vaishnavism schools consider Krishna to be the source of all avatars (Krishnaism).
The ten best known avatars of Vishnu are collectively known as the Dasavatara (a Sanskrit compound meaning "ten avatars"). This list is included in the Garuda Purana (1.86.10"11).[20]
The first four are said to have appeared in the Satya Yuga (the first of the four Yugas or ages in the time cycle described within Hinduism). The next three avatars appeared in the Treta Yuga, the eighth descent in the Dvapara Yuga and the ninth in the Kali Yuga. The tenth, Kalki, is predicted to appear at the end of the Kali Yuga.[21]
Matsya, the fish-avatar who saved Manu – the progenitor of mankind from the great deluge and rescued the Vedic scriptures by killing a demon. Story can be found in the Matsya Purana.
Kurma, the tortoise-avatar, who helped in the Samudra manthan – the churning of the ocean. Story can be found in the Kurma Purana.
Varaha, the boar-avatar, who rescued the earth from the ocean, by killing her kidnapper-demon Hiranyaksha. Story can be found in the Varaha Purana.
Narasimha, the half man-half lion avatar, who killed the tyrant demon-king Hiranyakashipu, to rescue the demon's son Prahlada, who was a Vishnu-devotee
Vamana, the dwarf-avatar, who subdued the king Maha Bali. Story can be found in the Vamana Purana.
Parashurama, sage with the axe who killed the thousand-armed king Kartavirya Arjuna
Rama, the king of Ayodhya and the hero of the Hindu epic Ramayana
Krishna, the king of Dwarka, a central character in the Bhagavata Purana and the Mahabharata and reciter of Bhagavad Gita.
Buddha, the sage
Kalki ("Eternity", or "time", or "The Destroyer of foulness"), who is expected to appear at the end of Kali Yuga. Story can be found in the Kalki Purana.
Note: Some versions include Balarama (the elder brother of Krishna) as the eighth avatar, with Krishna listed as the ninth instead of Buddha, while others replace Buddha with Balarama as the ninth avatar.Jayadeva in his Git Govinda instead adds both Balarama and Buddha,but omits Krishna as he is taken as the equivalent of Vishnu,the origin of all avatars.
In the Bhagavata Purana
As many as forty specific avatars of Vishnu are mentioned in the Bhagavata Purana, though the book adds that the number is innumerable.[22] Twenty-two avatars of Vishnu are listed numerically in the first book:[23]
Four Kumaras (Catursana) [BP 1.3.6] – the four Sons of god Brahma and exemplified the path of devotion.
Varaha [BP 1.3.7]
Narada [BP 1.3.8] the divine-sage who travels the worlds as a devotee of Vishnu
Nara-Narayana [BP 1.3.9] – the twin-sages
Kapila [BP 1.3.10] – a renowned sage spoken of in the Mahabharata, son of Kardama Muni and Devahuti and sometimes identified with the founder of the Samkhya school of philosophy
Dattatreya [BP 1.3.11] – the combined avatar of the Hindu trinity Brahma, Vishnu and Shiva. He was born to the sage Atri became a great seer himself.
Yajna [BP 1.3.12] – the lord of fire-sacrifice, who took was the Indra – the lord of heaven
Rishabha [BP 1.3.13] – the father of King Bharata and Bahubali
Prithu [BP 1.3.14] – the sovereign-king who milked the earth as a cow to get the world's grain and vegetation and also invented agriculture
Matsya [BP 1.3.15]
Kurma [BP 1.3.16]
Dhanvantari [BP 1.3.17] – the father of Ayurveda medicine and a physician to the Devas.
Mohini [BP 1.3.17] – the enchantress
Narasimha [BP 1.3.18]
Vamana [BP 1.3.19]
Parashurama [BP 1.3.20]
Vyasa [BP] 1.3.21] – the compiler of the scriptures – Vedas and writer of the scriptures Puranas and the epic Mahabharata
Rama [BP 1.3.22]
Krishna [BP 1.3.23]
Balarama [BP 1.3.23]
Buddha [BP 1.3.24]
Kalki [BP 1.3.25]
Besides these, several others are mentioned like Sri Hayagriva, Hari, Hamsa, Prsnigarbha, Vibhu, Satyasena, Vaikuntha, Sarvabhauma, Visvaksena, Dharmasetu, Sudhama, Yogesvara, Brhadbhanu. [24] The Golden incarnation [BP 11.5.32] the avatara in Kali-yuga for propagating hari-namasankirtan, which is sometimes interpreted as the saint Chaitanya Mahaprabhu is also mentioned, though there is no explicit mention of a name in the verse.[25]
Other Vaishnava avatars
There are many senses and shades of meaning of the term avatar within Hinduism.
Purusha avatars are sometimes described as the original avatars of Vishnu within the Universe:[26][27][28]
Vasudeva
Sankarshan
Pradyumna
Aniruddha
Guna avatars
The personalities of the Trimurti (Hindu trinity) are also sometimes referred to as Guna avatars, because of their roles of controlling the three modes (gunas) of nature,[27] even though they have not descended upon an earthly planet in the general sense of the term 'avatar'.
Vishnu – As controller of the mode of goodness (sattva)
Brahma – Controller of the mode of passion and desire (rajas)
Shiva – Controller of the mode of ignorance (tamas)
Avataric incarnations are classified as two kinds
direct (sakshat)
indirect (avesa)
When Vishnu himself descends, he is called sakshat or shaktyavesa-avatara, a direct incarnation of God. But when he does not incarnate directly, but indirectly empowers some living entity to represent him, that living entity is called an indirect or avesa avatar.[31][unreliable source?]
There are said to be a great number of avesa avatars. Examples include Narada Muni, Sugata Buddha, and Parashurama. Parashurama is the only one of the traditional ten avatars that is not a direct descent of Vishnu.
According to the Sri Vaishnavism sect of Hinduism, there are two types of primary or direct avatars, Purna avatars and Amsarupavatars:
Purna avatars are those in which Vishnu takes form directly and all the qualities and powers of God are expressed, (e.g. Narasimha, Rama and Krishna).,[32][33][unreliable source?]
Amsarupavatars are those in which Vishnu takes form directly but He is manifest in the person only partially. (e.g. avatars from Matsya, Kurma etc.).
The avesa or indirect avatars are generally not worshiped as the Supreme being. Only the direct, primary avatars are worshiped in this way. In practice, the direct avatars that are worshiped today are the Purna avatars of Narasimha, Rama and Krishna. Among most Vaishnava traditions, Krishna is considered to be the highest Purna avatar. However, followers of Chaitanya (including ISKCON), Nimbarka, and Vallabha Acharya differ philosophically from other Vaishnavas, such as Ramanujacharya and Madhvacharya, and consider Krishna to be the ultimate Godhead, not simply an avatar. That said, all Hindus believe that there is no difference between worship of Vishnu and His avatars as it all leads to Him. According to Madhvacharya (chief proponent of Dvaita or school of differential monism), all avatars of Vishnu are alike in potency and every other quality. There is no gradation among them, and perceiving or claiming any differences among avatars is a cause of eternal damnation. See Madhva's commentary on Katha Upanishad.
In Sikhism
24 avatars of Vishnu are mentioned in Bachitar Natak's composition in Dasam Granth, the second scripture of Sikhs written by Guru Gobind Singh:[10]
Macha (Matsya)
Kaccha (Kurma)
Narayana (Narayana in Nara-Narayana)
Maha Mohini (Mohini)
Bairaha (Varaha)
Nar Singha (Narasimha)
Bavana (Vamana)
Parashurama
Brahma
Rudra (Shiva)
Jalandhara
Bishan (Vishnu)
Sheshayi (Shesh)
Arihant Dev
Manu Raja
Dhanvantari
Suraja (the sun)
Chandara (the moon)
Rama
Balarama
Krishna
Nara (Nara in Nara-Narayana, ie, Arjuna)
Buddha
Kalki
Avatars of Ganesha
The Linga Purana declares that Ganesha incarnates to destroy demons and to help the gods and pious people.[34] The two upapuranas – Ganesha Purana and Mudgala Purana – detail the avatars of Ganesha. Both these upapuranas are core scriptures of the Ganapatya sect – exclusively dedicated to Ganesha worship.
Four avatars of Ganesha are listed in the Ganesha Purana:Mohotkata, Mayūreśvara, Gajanana and Dhumraketu. Each avatar corresponds to a different yuga, has a different mount and different skin complexion, but all the avatars have a common purpose – to slay demons.[35]
The Mudgala Purana describes eight avatars of Ganesha:[36]
Vakratunda (Vakratuṇḍa) ("twisting trunk"), his mount is a lion.
Ekadanta ("single tusk"), his mount is a mouse.
Mahodara ("big belly"), his mount is a mouse.
Gajavaktra (or Gajānana) ("elephant face"), his mount is a mouse.
Lambodara ("pendulous belly"), his mount is a mouse.
Vikata (Vikaṭa) ("unusual form", "misshapen"), his mount is a peacock.
Vighnaraja (Vighnarāja) ("king of obstacles"), his mount is the celestial serpent Śeṣa.
Dhumravarna (Dhūmravarṇa) ("grey color") corresponds to Śiva, his mount is a horse.
Avatars of Shiva
Although Puranic scriptures contain occasional references to avatars of Shiva, the idea is not universally accepted in Saivism.[7][37] As an avatar requires residence in a womb, Shiva as ayonija (not of a womb) cannot manifest himself as an avatar. The Linga Purana speaks of twenty-eight forms of Shiva which are sometimes seen as avatars.[38] In the Shiva Purana there is a distinctly Saivite version of a traditional avatar myth: Shiva brings forth Virabhadra, one of his terrifying forms, in order to calm Narasimha, an avatar of Vishnu. When that fails, Shiva manifests as the human-lion-bird Sharabha. The story concludes with Narasimha becoming a devotee of Shiva after being bound by Sharabha.[39] However, Vaishnava followers including Dvaita scholars, such as Vijayindra Tirtha (1539–95) refute this Shaivite view of Narasimha based on their reading of Sattvika Puranas and Śruti texts.[40]
The monkey-god Hanuman who helped Rama – the Vishnu avatar is considered by some to be the eleventh avatar of Rudra (Shiva).[41][42] Some regional deities like Khandoba are also believed by some to be avatars of Shiva.[43][44]
Other stated avatars of Shiva, according to some sources, are 8th century non-dualist Vedanta philosopher (Advaita Vedanta) Adi Shankara. He was named "Shankara" after Lord Shiva and is considered by some to have been an incarnation of the god[45] and Virabhadra who was born when Shiva grabbed a lock of his matted hair and dashed it to the ground. Virabhadra then destroyed Daksha's yajna (fire sacrifice) and severed his head as per Shiva's instructions.[46]
In Dasam Granth, Guru Gobind Singh have mentioned two avatars of Rudra: Dattatreya Avatar and Parasnath Avatar.[47]
Avatars of Devi
Avatars are also observed in Shaktism, the sect dedicated to the worship of the Goddess (Devi), but they do not have universal acceptance in the sect. The Devi Bhagavata Purana describes the descent of Devi avatars to punish the wicked and defend the righteous—much as the Bhagavata Purana does with the avatars of Vishnu.[48] Like Vishnu, his consort Lakshmi incarnates as Sita and Radha – the consorts of Rama and Krishna avatars.[49] Nilakantha, an 18th-century commentator on the Devi Bhagavata Purana – which includes the Devi Gita – says that various avatars of the Goddess includes Shakambhari and even the masculine Krishna and Rama – generally thought to be Vishnu's avatars.[50] Lakshmi and Saraswati are also goddesses worshipped as Devi avatars.[51]
Avatars of Lakshmi
Sridevi and Bhudevi are two different forms of Goddess Lakshmi. Dharini, the consort of Parashurama, Sita, the consort of Rama and Yashodhara, the consort of Buddha along with the consorts of the previous incarnations of Vishnu are all considered full incarnations of Lakshmi.[citation needed] On the other hand, Radha and the gopis , Rukmini, Satyabhama and the rest of Krishna's wives with the exception of Yamuna are all considered partial incarnations of Lakshmi.[citation needed]
Avatars of Brahma
In Dasam Granth, second scriptures of Sikhs written by Guru Gobind Singh, mentioned seven Brahma Avatars.[52]
Valmiki Avatar
Kashyap Avatar
Sukra Avatar
Baches Avatar
Vyas Avatar
Khat Rishi Avatar
Kalidas Avatar