ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

FOR SPARKLING AND CLEAN DENTAL CARE - FOLLOW TELUGU TIPS


పళ్లు… మిళమిళమెరవాలంటే..
ఆరోగ్యం, ప్రోగ్రామ్స్
మనకు దృఢమైన పళ్లు చాలా అవసరం. ఆహారాన్ని బాగా నమిలి తినవచ్చు. దీని వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తిన్న ఆహారం వంటికి పట్టే అవకాశాలున్నాయి. పంటి సమస్యలు మనకు మానసికంగా,శారీరకంగా, సామాజికంగా ప్రభావం చూపుతాయి. పళ్లను నిర్లక్ష్యం చేయడం వల్ల పంటి వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. అందువల్ల చెడుశ్వాస దరిచేరుతుంది. చివరికి నవ్వడానికి కూడా ఇబ్బంది ఎదురవుతుంది.
ంతాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల చిగుళ్ల నొప్పి, వాపు రావు. చిగుళ్ల నుంచి రక్తం కారదు. పళ్లు వదులుకాకుండా ధృఢంగా ఉంటాయి.
పంటి సమస్యల నుంచి గట్టెక్కడానికి…
- ఫ్లోరైడ్‌ ఉన్న టూత్‌ పేస్ట్‌తో మీ పళ్లను రోజుకు రెండుసార్లు శుభ్రపర చుకోవాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత, రాత్రి పడుకునే ముందు ఇలా చేయాలి.
- రోజులో అప్పుడప్పుడు నోటిని నీళ్లతో పుక్కిలించాలి.
- పొగాకు పీల్చడం, నమలడం చేయకూడదు.
-మనం తీసుకుంటున్న మందుల్లో సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే లక్షణాలున్నాయా అని డాక్టర్‌ని అడిగి తెలుసుకోవాలి. పళ్లను దెబ్బతీసే మందులు వాడకూడదు. ఉదాహరణకు కొన్ని మందులు పరగడపున వేసుకోవడం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి.
- పళ్లను ప్రతీరోజు అద్దంలో చూస్తూ చెక్‌ చేసుకోవాలి.
-డెంటిస్ట్‌ ను తరచూ సంప్రదిస్తూ ఉండాలి.
-తాగే, తినే ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలి. తీపిపదార్థాలు ఎక్కువసేపు నోట్లో ఉంటే పంటి సమస్యలు వస్తాయి.
-ఆకుకూరలు, కాయగూరలు తినడం వల్ల పంటి సమస్యల అధిగమించొచ్చు.
దంతాల ఆరోగ్యం కోసం…
- చెక్కెర అధిక సాంద్రతలో ఉండే ఐస్‌ క్రీం, హల్వా, గులాబ్‌జామున్‌, బర్ఫి తదితర స్వీట్లకు దూరంగా ఉండాలి.
- చెక్కెర తక్కువ మోతాదులో ఉన్న పౌష్టికాహారం తీసుకోవాలి. పాలు, అన్నం, మాంసం, పండ్లు, చేపలు ఉండాలి.
- రిఫ్రెషింగ్‌ డ్రింక్స్‌ లో చెక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని అసలు ముట్టకుండా ఉంటే మంచిది.
- స్వీట్లు తిన్న తర్వాత భోజనం చేయడం అన్ని విధాల మంచిది. స్వీట్లు తినడం వల్ల లాలాజలం ఉత్తత్తి ఎక్కువవుతుంది.
ఏ ఆహారం ఎంత మోతాదు తీసుకోవాలి…
-జిగటగా ఉన్న ఆహార పదార్థాలు తినకూడదు. ఎందుకంటే అది పళ్ల మధ్య ఇరుక్కుని బ్యాక్టీరియాను వృద్ది చేస్తుంది.
-తక్కువ చెక్కెర శాతం ఉన్న ఆహార పదార్థాలు, తక్కువ కొవ్వు ఉన్న కాయగూరలు, తాజా పండ్లు, చిరుధాన్యాలతో తయారయ్యే బ్రెడ్‌ తీసుకోవడం మంచిది.
-చాలావరకు దంతసమస్యలను సులువుగా నివారిం చవచ్చు. పళ్లకు ఆరోగ్యాన్నిచ్చే ఆహారపదార్థాలను భుజించాలి. తరచుగా చెకప్‌ చేయించుకోవాలి.
కొన్ని సాధారణ దంతసమస్యలు
దుర్వాసన
చాలామందికి నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఒక్కోసారి ఈ సమస్య శాశ్వతంగా ఉండిపోతుంది. కాబట్టి దుర్వాసన వచ్చిన వెంటనే డెంటిస్ట్‌ను సంప్రదించాలి. నోట్లో బ్యాక్టీరియా ఉండటం వల్ల ఈ వాసన వస్తుంది. నోటిని శుభ్రం చేసుకోవడం వల్ల చిగుళ్ల వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. పళ్లలో చిక్కుకున్న ఆహార పదార్థాలను ఎప్పటికప్పడు తొలగించాలంటే రోజుకు రెండుసార్లు బ్రష్‌ చేయాలి. అలాగే టంగ్‌ క్లీనర్‌ ద్వారా నాలుకను శుభ్రం చేయాలి.
కట్టుడు పళ్లయితే రాత్రిపూట తీసివేసి పడుకోవాలి. మరుసటి రోజు వాటిని బ్రష్‌ ద్వారా శుభ్రపరిచి పెట్టుకోవాలి.
పళ్లు పాడవడమూ చాలాసాధారణ సమస్య. ఈ సమస్య వున్న వారికి బ్యాక్టీరియా సర్వసాధారణంగా నోట్లో ఉంటుంది.లాలాజలంలో ఈ బ్యాక్టీరియా చేరుకుని పంటిని పాడుచేస్తుంది. ఈ బ్యాక్టీరియా చెక్కెర ఉన్న ఆహార పదార్థాలను తింటుంది.ఇవి ఆవ్లూలను ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల పంటి పై పొర మీద ఉన్న ఎనామిల్‌ పాడవుతుంది.
చిగుళ్ల వ్యాధి ఇన్‌ఫెక్షన్‌ వల్ల వస్తుంది. తద్వారా పంటి చిగురు వ్యాధికి గురవుతుంది. పంటి ఆరోగ్యాన్ని కాపాడటానికి అన్ని విధాలా జాగరూకతతో వ్యవహరిస్తే చిగుళ్ల వ్యాధి వచ్చే అవకాశముండదు.