ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

IMPORTANCE OF FRUITS / BANANAS USED FOR GOD'S PUJA


అరటి పండు నైవేద్యంగా పెడితే.. ఇష్టార్థ సిద్ధి కలుగుతుందట. 

1. అరటి పండు నైవేద్యంగా ఉంచితే... ఇష్టార్థ సిద్ధి కలుగుతుంది.

2. చిన్న అరటి (యాలక్కి అరటి) నైవేద్యంగా ఉంచితే...నిలచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. త్వరగా పనులు పూర్తవుతాయి.

3. అరటి పండు రసాయనం (గుజ్జు) నైవేద్యం ద్వారా - అప్పుల బాధ తొలగిపోతుంది. రావలసిన డబ్బు తిరిగి వస్తుంది. నష్టపోయిన నగదును పొందే అవకాశం, రాదనుకున్న నగదు తిరిగి రావటం, ప్రభుత్వానికి పన్ను రూపంలో ఎక్కువ కట్టినా తిరిగి వస్తుంది. పెళ్లి శుభకార్యాలకు కావలసిన నగదు సకాలంలో చేతికి అందుతుంది. హఠాత్తుగా నగదు మంజూరై చేతికి లభిస్తుంది.

4. పూర్ణఫలం/కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా పెడితే- పనులు త్వరగా, సులభంగా అవుతాయి. మనం మనసు పెట్టిన విధంగానే పనులు నెరవేరుతాయి. అన్ని పనులు దిగ్విజయంగా జరుగుతాయి. పని చేసి పెట్టేవారు మంచి స్నేహితుల్లాగా పని చేసి పెడతారు. పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు.

5. సపోటా పండును నైవేద్యంగా పెడితే- అమ్మాయిను చూసి వెళ్లినవారు ఒప్పుకునేందుకు ఆలస్యం చేస్తున్నా, లేదా సంబంధం చేసుకునేందుకు నిరాకరించినా, ఇతరుల మధ్య వర్తిత్వం ద్వారా ప్రయత్నించినా అబ్బాయి తరపు వారు నిరాకరిస్తే, సపోటా పండును దేవునికి నైవేద్యంగా పెడితే ఎటువంటి అవాంతరాలున్నా తొలగిపోతాయి.

6. దేవునికి కమలా పండు నైవేద్యంగా పెడితే - పనులు చేసి పెడతామని మాట ఇచ్చిన తరువాత వేర్వేరు కారణాలతో పనులు నిలిచి పోతే, కమలాపండును దేవునికి నైవేద్యంగా ఉంచితే నమ్మకమైన వ్యక్తుల ద్వారా అయ్యే పనులు పూర్తవుతాయి.