ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

MARGASIRAMULO LAKSHMI VARA VRATHAM - GODDESS SRI MAHALAKSHMI PUJALU


మార్గశిరంలో లక్ష్మీవారవ్రతం

లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు పొందాలనుకునేవారంతా మార్గశిరంలో లక్ష్మీవారవ్రతం తప్పకుండా చేయాలనుకుంటారు. దీన్నే కొందరు గురువారలక్ష్మి పూజ, లక్ష్మీదేవినోము అని పిలుస్తారు.

మార్గశిర లక్ష్మీపూజ ఐదు గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం. మార్గశిరమాసంలోని గురువారాలు, పుష్యమాసంలోని మొదటి గురువారంనాడు వ్రతాన్ని ఆచరించవలెను.

* వ్రత విధానం..

ముందుగా ప్రాతఃకాలాన నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్టించుకోవాలి. దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతో, బియ్యప్పిండితో వేసిన ముగ్గుతో అలంకరించాలి. మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది. విఘ్నేశ్వరార్చన అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిష్ఠగా నిర్వహించాలి. 'హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత ప్రజాం' అంటూ ప్రార్ధన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఆసనం, పాద్యం,ఆర్గ్యం, ఆచమనీయం, శుద్దోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూర నీరాజనాన్ని యధావిధిగా సమర్పించాలి. ' ఓం లక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీచ ధీమహి తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్' అంటూ లక్ష్మీగాయత్రి పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి. అనంతరం 'సహస్రదళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం' సిద్ధలక్ష్మీ కవచాన్ని సభక్తికంగా చదువుకోవాలి. తరువాత అష్టోత్తర నామావళి పూజ చేసి, మహానైవేద్యం సమర్పించాలి. నైవేద్యానంతరం లక్ష్మీవారవ్రత కథని చెప్పుకుని అక్షతలు శిరసున ధరించాలి. క్షమాప్రార్ధన చేయాలి.

అమ్మవారికి సమర్పించే మహానైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెబుతారు. తొలి గురువారం అమ్మవారు పుట్టినవారంగా ప్రఖ్యాతమైంది. కాబట్టి ఈ రోజు నోము సందర్భంగా పులగం నివేదన చేయాలి. రెండవవారం క్షీరాన్నం (పరమాన్నం), మూడవవారం అట్లు, తిమ్మనం లేదా కుడుములు, నాలుగోవారం గారెలు, అప్పాలు నైవేద్యం పెట్టాలి. ఐదోవారం నాడు అమ్మవారికి పూర్ణం బూరెలను నివేదించాలి. ఆ రోజు అయిదుగురు ముత్తయిదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. అనంతరం దక్షిణ తాంబూలాదులిచ్చి వారి ఆశీస్సులు పొందాలి. దీంతో మార్గశిర లక్ష్మీవ్రతం పూర్తయినట్లే. ఇతర వ్రతాల్లాగా పూజ పూర్తయ్యాక ఉద్యాపన చెప్పే క్రియ ఈ నోములో ఉండదు. ఎందుకంటే మన ఇంట్లో సౌభాగ్యలక్ష్మి నిత్యం విలసిల్లేందుకే ఈ పద్ధతని ఉవాచ.