ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE IN TELUGU ABOUT THE WELL - RANI KA WAAP IN GUJARAT INDIA - MUST VISIT


భారత దేశపు సరికొత్త వారసత్వ ప్రదేశం - రాణి కి వావ్ !

రాణి కి వావ్ అనే మెట్ల బావి ఒక మంచి సాంకేతిక పరిజ్ఞానానికి, శిల్ప శైలి కి ప్రతీక. ఈ మెట్ల బావి గుజరాత్ ను పాలించిన సోలంకి రాజ వంశ పాలనలో నిర్మించబడినది. రాణి ఉదయమతి నిర్మించిన ఈ బావి గతంలోని సరస్వతి నది ఒడ్డున పటాన్ లో నిర్మించ బడినది. దీనిని ఆమె తన భర్త రాజు భీమ దేవ్ - I జ్ఞాపకార్ధం నిర్మించినది.
అందమైన ఈ మెట్ల బావి తాజా గా ౧౯౮౦ సంవత్సర తవ్వకాలలో అనేక శతాబ్దాల తర్వాత బయట పడగా, దీనికి నేడు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు లభించానది. మరి ఇంత గోప్పగాచేప్పబడే ఈ మెట్ల బావి చిత్రాలు కొన్ని పరిశీలిద్దాం.
* విస్మయం పనితనం
ఒక దేవాలయ నిర్మాణం తలపించే ఈ కట్టడం ప్రత్యేకించి నీటికి ప్రాధాన్యత ఇవ్వబడినది. ఈ బావి ఏడూ అంతస్తులు. ప్రస్తుతం అయిదు మాత్రమే కలవు. దీనికి గల బాల్కనీలు అద్భత చెక్కడాలు కల విష్ణు మూర్తి అవతారాలు, సాధువులు, రాజులు, నాత్యకారిని ల మొదలైనవి గా నిర్మించబడ్డాయి. నాట్య కారినుల అందాలు 'పదహారేళ్ళ పడుచుల అందాలు' తలపిస్తాయి.
* విశిష్ట శిల్పాలు
నలుచదరంగా కల ఈ నిర్మాణం సుమారు 1500 ప్రధాన దేవతల మరియు మత పర చెక్కడాలు కలిగి వుంటుంది. పదకొండవ శతాబ్దంలో నిర్మించిన ఈ మెట్ల బావి, ఎన్నో సహజ విపత్తులకు ఆర్చిన ఆ నాటి శిల్ప కళా పని తనానికి అద్దం పడుతుంది.
* వారసత్వ ప్రదేశం
ఈ మెట్ల బావిని వారసత్వ ప్రదేశంగా గుర్తించాలని ప్రపంచ యునెస్కో సంస్థ కు ఫిబ్రవరి, 2013 లో దరఖాస్తు చేసారు. గతంలో దీనిని అనేక మంది విదేశీ ప్రతినిధులు సందర్శించారు. నేడు గుర్తింపు పొందిన ఈ సైట్ ఇండియా లో 31 వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా పెర్కొనబడుతోంది.
* శ్రీ మహా విష్ణువు అవతారాలు
ఈ మెట్ల బావి ప్రదేశంలో చెక్కబడిన కొన్ని మహావిష్ణువు అవతారాలు అధిక ఆకర్షణ కలిగి ఒక పవిత్ర ప్రదేశంగా పరిగనించ బడతాయి. శిల్ప కళ చరిత్ర, ఆధ్యాత్మిక అంశాలు కల ఈ రాణి కి వావ్ అనే మెట్ల బావి జీవితంలో కనీసం ఒక్కసారి అయినా చూడదగిన పర్యాటక అద్భుతం.
* ఆది వరాహ అవతారం
శ్రీ మహా విష్ణువు యొక్క ఆది వరాహ అవతారం ఇక్కడ అద్భుతంగా మలచబడినది. పౌరాణిక గాదల మేరకు విష్ణు మూర్హి వరాహ రూపంలో భూమిని సంరక్షిన్చాడని, అందుకు కృతజ్ఞతగా భూదేవి ఆది వరాహ స్వామిని వివాహం చేసుకుందని చెపుతారు.
* వామనావతారం
శ్రీ మహా విష్ణువు యొక్క ఐదవ అవతారంగా వామన అవతారం చెపుతారు. వామనుడు అంటే ఒక పొట్టి బ్రాహ్మణుడు. బాలి చక్రవర్తిని మూడు అడుగులు దానం కోరి, చివరికి అతడినే తన మూడవ అడుగు కొరకు తలపై కాలు పెట్టి మోక్షం ప్రసాదిస్తాడు.
* కల్కి అవతారం
కల్కి అవతారం శ్రీ మహా విష్ణువు యొక్క చివరిది. పదవ అవతారం. కలియుగం చివరలో ఇది దర్శనం ఇస్తున్దంటారు. ఈ అవతారంలో విష్ణువు ఒక గుర్రం పై అధిరోహించి ఒక మెరిసే కట్టి చేపట్టి ఉంటాడు.
* రక్షిత చర్యలు
సందర్శకులను మెట్ల బావి చివర వరకు అనుమతించేవారు. అయితే, భుజ్ లో వచ్చిన భూకంపం కారణంగా ఈ నిర్మాణంలో కొద్దిపాటి అస్తిరత్వం చోటు చేసుకుంది. నేడు కొన్ని భాగాలు పబ్లిక్ కు మూసి వేసారు. మరింత నష్టం దీనికి జరుగకుండా పురావస్తు శాఖ చర్యలు చేపడుతోంది. ఈ ప్రాంతంలోని ఇతర భాగాలలో కల, రాజ భవనాలు, దేవాలయాలు కూడా వెలికి తీసేందుకు కృషి చేస్తున్నారు.