ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

RAINY SEASON HEALTH TIPS - HEALTH WITH GINGER IN RAINY AND WINTER SEASON


వర్షాకాలం అల్లం తప్పనిసరి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. అల్లంను టీతో పాటు ఆహార పదార్థాల్లో మితంగా వాడుకోవడం ద్వారా జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. యాంటీ-ఇన్‌ఫ్లామేటరీగా పనిచేసే అల్లంను జ్యూస్‌గా తీసుకుంటే రక్తంలోని మలినాలను శుభ్రం చేసినట్లవుతుంది. అలాగే క్యాన్సర్‌ను నిరోధించే శక్తి అల్లానికుంది. క్యాన్సర్ సెల్స్‌ను ఇది నశింపజేస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్‌ను అల్లం నిరోధిస్తుందని న్యూట్రీషన్లు అంటున్నారు.

అరగ్లాసు అల్లం రసంలో నాలుగైదు చుక్కలు తేనె కలుపుకుని రోజూ తాగితే మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. జీర్ణక్రియను మెరుగుపరిచే అల్లం మైగ్రేన్ వంటి తలనొప్పులను మటుమాయం చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించే అల్లం జలుబు, దగ్గును నివారిస్తుంది.

ఇకపోతే.. అల్లం జ్యూసును మాడుకు పట్టిస్తే.. చుండ్రు తొలగిపోతుంది. జుట్టు రాలదు. తద్వారా జుట్టు పొడవుగా, మృదువుగా, ఆకర్షణీయంగా తయారవుతుంది. అలాగే జింజర్ జ్యూస్‌ను ముఖానికి రాసుకోవడం ద్వారా మొటిమలు, మచ్చలుండవు. చర్మం కోమలంగా మారుతుంది.