ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HAIR GROWTH HEALTH TIPS - TIPS TO IMPROVE HAIR GROWTH


కేశాలకు పోషకాలు
జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల పూతలు వేసుకోవడం, నాణ్యమైన కేశసంరక్షణ ఉత్పత్తులు వాడటం మనలో చాలామంది చేసేదే. అయితే మనం తీసుకునే ఆహారంలో కొన్ని పోషకాలు కూడా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి.
అవేంటంటే..!
* ప్రొబయోటిక్స్‌: ఇది జుట్టును బలంగా మారుస్తుంది. త్వరగా చిట్లకుండా చేస్తుంది. ఈ ప్రోబయోటిక్స్‌ సజీవ బ్యాక్టీరియా రూపంలో అందుతుంది. ఈ పోషకం హానిచేసే బ్యాక్టీరియాను నశింపచేస్తుంది. దాంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడటమే కాదు, శరీరానికి, జుట్టుకీ ఇవి బాగా అందుతాయి. ప్రొబయోటిక్స్‌ సరిగ్గా అందేందుకు పెరుగు ఎక్కువగా తీసుకోవాలి.
* మాంసకృత్తులు: జుట్టు ఆరోగ్యంగా ఎదగడానికి తోడ్పడతుందీ పోషకం. పీచుని అందించి జుట్టు కుదుళ్లను దృఢపరచడంలో కీలకంగా పనిచేస్తాయి మాంసకృత్తులు. ఇందుకోసం గుడ్లూ, గింజధాన్యాలూ, బీన్స్‌, పాలూ, పాల పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.
* ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు:
మాడూ, జుట్టు కుదుళ్లూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పోషకాలు అందేలా చూసుకోవాలి. చాలామందికి చుండ్రు సమస్య ఉంటుంది. లేదా తల్లోని చర్మం దురద పుట్టి.. పొట్టులా రాలిపోతుంది. ఈ సమస్యల్ని అధిగమించాలంటే ఒమెగా త్రీ ఫ్యాటీయాసిడ్లు ఉన్న ఆహారాన్ని ఎంచుకోవాలి. ఇవి మాడుకే కాదు, జుట్టుకీ ఎంతో మేలు చేస్తాయి.. ఒత్తుగా పెరిగేందుకు తోడ్పడతాయి. జుట్టు పొడిబారకుండా కూడా ఉంటుంది. అవిసెగింజలూ, ఆకుకూరలూ, చేపల్లాంటివి ఎక్కువగా తీసుకుంటే ఒమెగా త్రీ ఫ్యాటీఆమ్లాలు అందుతాయి. ఈ పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల చాలా తక్కువ సమయంలోనే మార్పు కనిపిస్తుంది.
* బి కాంప్లెక్స్‌ విటమిన్లు:
బి8, బి 12 విటమిన్లు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంటే ఈ పోషకాలు మాంసకృత్తులూ, మేలు చేసే కొవ్వులను జుట్టు సమగ్రంగా స్వీకరించేందుకు తోడ్పడతాయి. దాంతో తల్లో సహజ నూనెలు ఉత్పత్తి అయి.. జుట్టు ఆరోగ్యంగా, అందంగా మారుతుంది. ఈ పోషకం అందేందుకు ఆకుకూరలూ, చీజ్‌ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. అవసరం అయితే.. నిపుణుల సలహాతో బి విటమిన్లను సప్లిమెంట్ల రూపంలో తీసుకోవాలి.