ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

PERFUMES USAGE HEALTH TIPS


* సువాసనలతో సాంత్వన
ఒత్తిడి నుంచి బయటపడేందుకూ, మనసుకి సాంత్వన కలిగించేందుకూ సువాసనలు వెదజల్లే నూనెలు ఎంతో సాయపడతాయి. అవేంటో.. వాటిని ఎలా వాడాలో తెలుసా!
• లావెండర్‌: స్నానించే నీళ్లల్లో కొన్ని చుక్కల లావెండర్‌ నూనె, ఎప్సమ్‌ సాల్ట్‌, చిన్న కప్పుతో పాలు కలిపి స్నానం చేస్తే ఒత్తిడి ఉఫ్‌మంటూ దూరమవుతుంది. చక్కని నిద్రా మీ సొంతమవుతుంది. ఇక లావెండర్‌ నూనెతో మర్దన చేసుకోవడం వల్ల కండరాలు విశ్రాంతి అందుతుంది. జలుబు ఇబ్బంది పెడుతున్నప్పుడు రెండు చుక్కల లావెండర్‌ నూనెను ఖర్చీఫ్‌ మీద వేసుకుని వాసన చూస్తే ఫలితం ఉంటుంది. అంతేకాదు ఇది చర్మానికీ మేలు చేస్తుంది. ఇల్లంతా పరిమళ భరితం కావాలంటే ఓ గిన్నెడు వేడి నీళ్లలో నాలుగు చుక్కల లావెండర్‌ నూనె వేసి మూత తీసి గదిలో మధ్యలో ఉంచితే సరి.
• యూకలిప్టస్‌: కొబ్బరినూనెలో కొద్దిగా యూకలిప్టస్‌ (నీలగిరితైలం) నూనె కలిపి...తలకు మర్దన చేయడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. షాంపూలో కలిపి వాడితే కండిషనర్‌లా పనిచేస్తుంది. తలస్నానం చేయడానికి గంట ముందు కొబ్బరినూనెతో కలిపి తలకు పట్టించి స్నానం చేస్తుంటే జుట్టు బలంగానూ మారుతుంది. మెరుపూ సంతరించుకుంటుంది.జలుబూ, తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు యూకలిప్టస్‌ నూనెని రాసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరిగేందుకు తోడ్పడుతుంది.
• గులాబీ నూనె : గులాబీనూనెతో శరీరరానికి మర్దన చేయడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. పదివంతుల బాదం నూనెలో ఒక వంతు గులాబీనూనె కలిపి రాసుకోవాలి. మర్దన వల్ల మృదువైన చర్మమూ మీ సొంతం అవుతుంది. నీళ్లల్లోనూ గాలిలోనూ సులభంగా విస్తరించే గుణం కలిగిన గులాబీనూనెను స్నానం చేసే నీళ్లల్లో కలుపుకుంటే రోజంతా పరిమళం మీ వెంటే ఉంటుంది. దీనివల్ల ఒత్తిడీ అదుపులోకి వస్తుంది.