ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

DIABETES HEALTH TIPS - HOW TO REDUCE SUGAR EFFECT ON HUMAN BODY


తీపి తగ్గించుకునేలా..!

ఈమధ్య తీపిపై అందరూ జాగ్రత్తపడుతున్నారు. ముఖ్యంగా చక్కెర తగ్గించాలని తీర్మానాలూ చేసుకుంటున్నారు. కానీ ఎంత అదుపులోపెట్టుకున్నా.. ఒక్కోసారి తీపిపై ఆశ పోదు. 

అలాంటప్పుడు ఇవి పాటించండి..!

తీపి ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగానూ అందుతుంది. శీతలపానీయాలూ, బ్రెడ్డూ, కెచప్‌లలో ఇలా రకరకాల ప్రాసెస్‌ చేసిన ఆహారం తీసుకున్నప్పుడు వాటిలో ఉంటుంది. కాబట్టి కొనేటప్పుడే వాటిలో చక్కెర శాతం ఎంతో చూసుకోండి. తక్కువగా ఉన్నవాటినే ఎంచుకోండి.

* టీ, కాఫీల్లో చక్కెం తప్పనిసరే. కానీ ఎప్పుడూ వాటినే తాగాలని లేదు. తరచూ గ్రీన్‌ టీ వంటివి ఎంచుకుంటూ అప్పుడప్పుడూ కాఫీ, టీలూ తీసుకోండి. వీటివల్ల బరువు పెరుగుతారనే ఇబ్బంది కూడా ఉండదు.

* తీపి కావాలని మనసు కోరుతున్నప్పుడల్లా ఫ్రూట్‌ సలాడ్‌ వంటివి తినాలి. పండ్ల వల్ల శరీరానికి సహజ చక్కెర అందుతుంది. దాంతోపాటూ పీచు కూడా దొరుకుతుంది. యాలకులూ, లవంగాలూ, దాల్చిన చెక్క వంటివి నోట్లో వేసుకుని చప్పరించాలి.

* కొందరికి ఈ కాలంలో ఐస్‌క్రీమ్‌లు బాగా తినాలనిపిస్తుంది. అలాంటివారు పండ్ల రసాలూ, కాచి చల్లార్చిన పాలూ, కాస్త తేనె కలిపి ఐస్‌ ట్రేలలో పోయాలి. అందులో ఒక టూత్‌ పిక్‌ ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి. గడ్డకట్టాక ఐస్‌ ఫ్రూట్‌లా తినేయొచ్చు.