ఎలా నడిస్తే లాభాలంటే..!
ఇతరత్రా వ్యాయమాలకన్నా.. నడకనే ఎక్కువగా ఎంచుకుంటారు. ఆరోగ్యం కోసం నడక అనకున్నప్పుడు దానికి కొన్ని పద్ధతులు పాటించాలి. ఎలాగంటే..!
• పొట్ట తగ్గడం మీ లక్ష్యమా?
అయితే వాకింగ్ చేసేటప్పుడు పొట్టను లోపలికి లాగి పెట్టుకోవాలి. కానీ శ్వాస తీసుకుంటూ నడవాలి. మొదట్లో కష్టంగానే అనిపిస్తుంది కానీ.. క్రమంగా అలవాటు అవుతుంది.
* పాటలు వింటూ నడవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని అమెరికాకు చెందిన అధ్యయనకర్తలు చెబుతున్నారు. వారంలో కనీసం మూడుసార్లు ఇలా చేయడం వల్ల నడక ద్వారా మనం అనుకున్న లక్ష్యం ఇట్టే అందుకోవచ్చంటున్నారు.
* మొదట నెమ్మదిగా అడుగులు వేయాలి. ఐదు నిమిషాలయ్యాక శరీరాన్ని వేగంగా కదిలిస్తూ బ్రిస్క్ వాక్ చేయాలి. చివర్లో ఓ నిమిషం పరుగూ, మరో నిమిషం నడక చొప్పున చేయాలి. మొదటిసారి వ్యాయామం చేసేవారు నెమ్మదిగా జాగింగ్ మొదలుపెట్టి.. క్రమంగా పరుగెత్తేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. దానివల్ల ఎక్కువ కెలొరీలు కరుగుతాయి.
• ఎలాంటి లాభాలంటే..
* రోజులో కనీసం ఇరవై నిమిషాల నుంచి అరగంట వరకూ నడవాలి. దీనివల్ల శక్తిస్థాయులూ పెరుగుతాయని అంటున్నారు నిపుణులు. పచ్చని చెట్ల మధ్య నడిచేవారిలో ఆనందం డెబ్భై ఒక్కశాతం పెరుగుతుందని మైండ్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
* ప్రతిరోజూ నడిచేవారిలో గుండెజబ్బుల ప్రమాదం చాలామటుకూ తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరగడం, అధికరక్తపోటు అదుపులో ఉండటం ఇందుక్కారణం.
* నడకను వ్యాయామంగా ఎంచుకున్నవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం చాలా తక్కువ. అంతేకాదు కొన్నిరకాల క్యాన్సర్ల ప్రమాదం కూడా తగ్గుతుందట. ఆరుబయట నడవడం వల్ల విటమిన్ డి శరీరానికి అందుతుంది. ఎముకలు దృఢంగా మారతాయి.