ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HYDERABADI SPECIAL - MUTTON KURMA RECIPE


మటన్ కుర్మ: హైదరాబాది స్పెషల్

కావల్సిన పదార్థాలు: 

మటన్: 1/2kg 
పెరుగు: 1cup
నూనె: 1cup
కాశ్మిర్ రెడ్ చిల్లీ: : 4
ఉల్లిపాయలు: 4(సన్నగా తరిగినవి)
బాదం: 6
యాలకలు: 6
జీలకర్ర: 1tsp
మసాలాలు: 1tsp
నల్ల జీలకర్ర: 1tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1tbsp
గసగసాలు: 1tbsp
ధనియాలు: 2 tbsp
కొబ్బరి తురుము: 2 tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నూనెవేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకొని పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులో మటన్ వేసి ఒక కప్పు పెరుగు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ మరియు ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు చిన్నగిన్నెలో కాశ్మిర్ ఎండు మిర్చి వేసి నీళ్ళు పోసి కొద్దిగా వేడి చేయాలి. తర్వాత వాటిని తీసి మిక్సీ జార్ లో వేసి, వీటితో పాటు ధనియాలు కూడా వేసి పొడి లేదా పేస్ట్ చేసి మ్యారినేట్ చేసిన మటన్ ముక్కల్లో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.

4. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు కూడా మ్యారేట్ చేసిన మటన్ మిశ్రమంలో వేసి మిక్స్ చేయాలి. ఇలా మ్యారినేట్ చేసిన మటన్ ను రెండు మూడు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.

5. రెండు మూడు గంటల తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, అందులో మ్యారినేట్ చేసిన మటన్ వేసి, మూత పెట్టి తక్కువ మంట మీద ఉడికించాలి.

6. మటన్ మెత్తగా ఉడికి, నీరు వేరుపడుతున్నప్పుడు మంటను తగ్గించి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి.
7. ఇప్పుడు మూడు నాలుగు కప్పుల నీళ్ళు పోసి మరో 5నిముషాలు ఉడికించుకోవాలి.

8. అంతలోపు మిక్సీ జార్ లో గసగసాలు, నల్ల జీలకర్ర, తెల్లజీలకర్ర, కొబ్బరి తురుము మరియు యాలకలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

9. ఈ పేస్ట్ ను ఉడుకుతున్న మటన్ లో వేసి గరిటతో బాగా మిక్స్ చేయాలి.

10. కొద్దిసేపటి తర్వాత నెయ్యి కూడా వేసి, మంటను పూర్తిగా తగ్గించి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. అంతే హైదరాబాది మటన్ కుర్మా రెడీ.