తెలుసుకుందాము - మేళకర్త రాగాలు- విభజన
[ARTICLE BY SRI దేవరకొండ సుబ్రహ్మణ్యం]
ఈ మేళకర్త రాగ పట్టికని గతంలో మీతోపంచుకొన్నాను. ఐతే అప్పట్లో వివరాలను రాయక చిత్రం మాత్రమే పంచుకొన్నా. ఇప్పుడు ఈ చిత్రంలోని కొన్ని వివరాలను మీతో పంచుకొంటాను.
[ARTICLE BY SRI దేవరకొండ సుబ్రహ్మణ్యం]
ఈ మేళకర్త రాగ పట్టికని గతంలో మీతోపంచుకొన్నాను. ఐతే అప్పట్లో వివరాలను రాయక చిత్రం మాత్రమే పంచుకొన్నా. ఇప్పుడు ఈ చిత్రంలోని కొన్ని వివరాలను మీతో పంచుకొంటాను.
మన కర్నాటక సంగీతంలో ఉన్న మేళకర్త రాగాలు 72. అందులో సగభాగం అంటే మొదటి 36 రాగాలు "శుద్ధమధ్యమ రాగాలు" క్రమసంఖ్య 1 నుండి 36 వరకు) మిగిలిన 36 రాగాలు "ప్రతిమధ్యమ రాగాలు" (క్రమసంఖ్య 37 నుండి 72 వరకు). ఈ 72 రాగాలను 6 రాగాలకు ఒకచక్రం చప్పున మొత్తం 12 చక్రాలుగా విభజించి ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క నామం ఇచ్చారు. ఈ నామం మనకు గుర్తుంచుకోవటాని సులభం గా ఉండే పధతిలో ఉంచారు. కాస్త వివరంగా చూద్దాం.
1 వ చక్రం ఇందు చక్రం - అంటె చంద్రుడు మనకు ఒకటే చంద్రుడు కదా. శు.మ రాగాలు 1 నుండి 6 వరకు ఇందులో వస్తాయి.
2 వ చక్రం నేత్ర చక్రం - అంటే కళ్ళు మనకు రెండు కళ్ళు కదా . శు. మ. రాగాలు 7 నుండి 12 వరకు ఈ చక్రంలో వస్తాయి
3 వ చక్రం అగ్ని చక్రం - త్రేతాగ్నులు (మూడు అగ్నిలు). శు.మ. రాగాలు 13 నుండి 18 వరకు ఈ చక్రంలో వస్తాయి.
4 వ చక్రం వేద చక్రం - చతుర్వేదములు. శు.మ. రాగాలు 19 నుండి 24 వరకు ఈ చక్రంలో వస్తాయి.
5. వ చక్రం బాణచక్రం - పంచబాణములు మన్మధుని పుష్పబాణములు. శు.మ. రాగాలు 25 నుండి 30 వరకు ఈచక్రంలో వస్తాయి.
6 వ చక్రం రుతు చక్రం. ఆరు రుతువులు. శు.మ. రాగాలు 31 నుండి 36 వరకు ఈ చక్రంలో వస్తాయి.
ఇక్కడికి శుద్ధమధ్యమ రాగాలు పూర్తి అయ్యాయి.
7 వ చక్రం రిషి చక్రం - సప్తరిషులు! ప్ర. మ. రాగాలు 37 నుండి 42 వరకు ఈ చక్రంలో వస్తాయి.
8 వ చక్రం వసు చక్రం - అష్టవసువులు - ప్ర.మ. రాగాలు 43 నుండి 48 వరకు ఈ చక్రంలో వస్తాయి
9 వ చక్రం బ్రహ్మ చక్రం - నవబ్రహ్మలు - ప్ర.మ. రాగాలు 49 నుండి 54 వరకు ఈ చక్రంలో వస్తాయి.
10 వ చక్రం దిశి చక్రం - దశదిశలు - ప్ర.మ. రాగాలు 55 నుండి 60 వరకు ఈ చక్రంలో వస్తాయి.
11 వ చక్రం రుద్ర చక్రం - ఏకాదశ రుద్రులు - రాగాలు 61 నుండి 66 వరకు ఈ చక్రంలో వస్తాయి.
12 వ చక్రం ఆదిత్య చక్రం - ద్వాదశాదిత్యులు - రాగాలు 67 నుండి 72 వరకు ఈ చక్రంలో వస్తాయి
మరిన్ని సంగతులు కటపయాది సంఖ్యతో రాగాలను, స్వరస్థానాలను ఎలాగ కనుక్కోవటం మొదలైనవి ఇంకెప్పుడైనా తెలుసుకుందాము.