ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

MIX LIME JUICE WITH PAPAYA FRUIT GIVES MORE HEALTH - BOPPAYA FRUIT HEALTH BENEFITS IN TELUGU


హెల్తీ ఫ్రూట్స్ లో బొప్పాయి ఒకటి. బొప్పాయిని నేరుగా అలాగే తీసుకొనే కంటే కొద్ది నిమ్మరసం మిక్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి . మూడు చెంచాల బొప్పాయి జ్యూస్ లో 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూప్ మిక్స్ చేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని తాగడం వల్ల ఆరోగ్యానికి మెరుగైన ప్రయోజనాలను అందిస్తుంది.బొప్పాయి, నిమ్మరసం కాంబినేషన్ డ్రింక్ ను ప్రతి రోజూ ఉదయం పరగడపున తీసుకోవడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . మన శరీరంలో వివిధ అవయావాల మీద ప్రత్యేకంగా పనిచేయడంతో పాటు, వాటి ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తుంది. ఈ రెండి మిశ్రమం శరీరంలో కొన్ని ఎలిమెంట్స్ ను ప్రత్యేకంగా ట్రీట్ చేస్తుంది. మరి ఈ రెండింటి కాంబినేషన్ డ్రింక్ లో ఉండే అమేజింగ్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం..

1. హార్ట్ డిసీజ్ లను నివారిస్తుంది బొప్పాయి మరియు నిమ్మరసంలో రెండింటిలో విటమిన్ సి, బి మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇవి బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. బ్లడ్ ఫ్యాట్ లెవల్స్ ను నివారిస్తుంది . ముఖ్యంగా హార్ట్ కు సంబంధించిన అథిరోస్కెలోరిస్ మరియు కార్డియో వ్యాస్కులర్ డీస్ లను నివారిస్తుంది

2. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది బొప్పాయి జ్యూస్ మరియు నిమ్మరసం కాంబినేషన్ డ్రింక్ లో విటమిన్స్, మినిరల్స్, ఫొల్లెట్, పొటాషియం, మొదలగునవి అధికంగా ఉన్నాయి. ఇవి మన శరీరానికి అవసరమయ్యే న్యూట్రీషియన్స్ ను పుష్కలంగా అందిస్తుంది. దాంతో వ్యాధినిరోధకశక్తి స్ట్రాంగ్ గా పెరుగుతుంది.

3. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది బొప్పాయి మరియు నిమ్మరసం కాంబినేషన్ డ్రింక్ లో ఉండే బీటా కెరోటిన్ మరియు విటమిన్స్ పేగుల్లో హెల్తీ బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది . ఎసిడిటి లెవల్స్ ను తగ్గిస్తుంది. దాంతో జీర్ణశక్తి పెరుగుతుంది.

4. క్యాన్సర్ నివారిస్తుంది బొప్పాయి మరియు నిమ్మరసం కాబినేషన్ డ్రింక్ క్యాన్సర్ కణాల మీద పోరాడుతుంది . క్యాన్సర్ నివారిస్తుంది . ముఖ్యంగా కోలన్ , ప్రొస్టేట్, మరియు బ్లడ్ క్యాన్సర్ లను నివారిస్తుంది . ఇది శరీరంను డిటాక్సిఫై చేస్తుంది. శరీరంలో చలనంలేని కణాలను తొలగిస్తుంది.

5.ఆర్థరైటిస్ నివారిస్తుంది బొప్పాయి మరియు నిమ్మరసంలో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది మరియు వాపు తగ్గిస్తుంది. జాయింట్ పెయిన్, తలనొప్పి మరియు ఆర్థరైటిస్ నొప్పులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

6. కంటి చూపును మెరుగుపరుస్తుంది ఈ హెల్తీ డ్రింక్ కంటి చూపును మెరుగుపరుస్తుంది . ఈ కాంబినేషన్ డ్రింక్ లో ఉండే విటిమిన్ ఎ మరియు విటమిన్ సిలు ఆప్టిక్ లెవల్స్ ను పెంచుతుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది

7. ఒత్తిడి తగ్గిస్తుంది బొప్పాయి మరియు నిమ్మరసం కాంబినేషన్ డ్రింక్ లో విటమిన్ సి అధికంగా ుంటుంది. ఇది ఒత్తిడి తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఒత్తిడి తగ్గించడానికి అవసరమయ్యే హార్మోనుల ఉత్పత్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.