వేడి చేసిందా? చాలా ప్రమాదం... వెంటనే ఇలా చేసి తగ్గించుకోండి
అమ్మో వేడి చేసేసింది.. అంటూ చాలామంది చెపుతుంటారు... వేడి చేస్తే ముఖం అందవికారంగా మారుతుంది. పెదాలు నల్లబడిపోతాయి... ముఖం మాడిపోయినట్లు అవుతుంది. అంతేకాదు... కడుపులో మంట... కళ్ళు మంట... ఇలా ఒంట్లో వేడి తన్నుకొచ్చేసి... కస్సుబుస్సు లాడుతుంటారు. ఈ వేడంతా పోవాలంటే ప్రకృతి సిద్ధంగా ఇలా చేయండి.
-
ఒక టేబుల్ స్పూన్ మెంతులు నిత్యం చేసుకునే ఆహార పదార్ధాలలో వాడండి... అంటే కూరలు, పులుసులు చేసేటపుడు వేసే పోపులో ఇవి ఉంటే చాలు. మెంతులు మన శరీరంలోని వేడిని బాగా లాగేస్తాయి.
- ఉదయాన్నే గ్లాసుడు నిమ్మరసం తాగితే... ఒంట్లో వేడి తగ్గుతుంది. ఉప్పు, లేదా పంచదార వేసుకుని నిమ్మ నీళ్ళ తాగొచ్చు.
- దానిమ్మ జ్యూస్ తీసి, అందులో ఆల్మండ్ ఆయిల్ నాలుగు చుక్కలు వేసుకుని తాగితే చలవ.
- గ్లాసుడు పాలలో రెండు టేబుల్ స్పూన్ల వెన్న కలుపుకొని తాగితే వేడి తగ్గుతుంది.
- గసగసాలు వేడిని బాగా తగ్గిస్తాయి... కానీ, మోతాదు మించి తీసుకోవద్దు
- గ్లాసుడు పాలలో చెంచాడు తేనె కలుపుకొని తాగితే శరీరం అంతా కూల్
- అసలు మంచి నీళ్లు బాగా తాగితే... శరీరంలో వేడి తగ్గిపోయి.. సమ ఉష్ణోగ్రత ఏర్పడుతుంది.
- అలోవెరా జ్యూస్ చలవ చేస్తుంది... దాని ఆకుల మధ్య జెల్ నుదుటికి రాసుకుంటే చల్లగా హాయిగా ఉంటుంది.
- గంధం చల్లని నీరు, లేదా పాలతో కలిపి నుదుటకు రాసుకుంటే వేడి మటుమాయం.
- అన్నింటికీ మించి కొన్ని బార్లీ గింజలు వేడి నీళ్ళలో కాచి, మజ్జిగ వేసుకుని పలచగా తాగితే వేడి తగ్గుతుంది.