ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

NO NEED TO REDUCE OR CHANGE DAILY FOOD CHART


 తిండి తగ్గిస్తున్నారా...? 

శరీరం బరువు పెరిగిపోతోందనో, మధుమేహాన్ని నియంత్రించాలనో, ఇంకా సన్నబడాలనో కొందరు తినే ఆహారం మోతాదును బాగా తగ్గించివేస్తారు. ఇదేమిటి? ఉన్నట్లుండి ఇలా ? అని ఎవరైనా ప్రశ్నిస్తే, తినే మోతాదును తగ్గించినా పోషకాలు తగ్గకుండా జాగ్రత్తపడుతున్నామని చెబుతారు. అయితే శరీరానికి అవసరమైన పోషకాలు అందితే మాత్రమే సరిపోదు. అవసరమైన మోతాదులో అంటే ఆహారం జీర్ణాశయంలో సగబాగాన్ని కమ్మేసే పరిమాణంలో ఉండాలి. ఈ పరిమాణాన్నే వైద్య పరిభాషలో బల్క్‌ అంటారు. ఆ పరిమాణమే లేకపోతే, జీర్ణక్రి య బాగానే ఉన్నా, విసర్జన క్రియలో ఇబ్బంది ఏర్పడుతుంది. జీర్ణాశయంలో ఆ కాస్త బరువు పడకపోతే, ఒత్తిడి లేకపోవడంతో మలినాలు బయటికి వెళ్లడంలో తీవ్రమైన అంతరాయం ఏర్పడుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, తరుచూ ఆపాన వాయువులు విడుదల కావడం, తరుచూ త లనొప్పి రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఏదో ఒక రోజంటే అది వేరే మాట.
అలా కాకుండా, రోజూ అదే నియమాన్ని పాటిస్తే, మొత్తంగా జీర్ణశక్తి తగ్గిపోయి,
ఆ తర్వాత ఎప్పుడైనా కాస్త ఎక్కువ మోతాదులో తింటే అజీర్తి కావడమే కాదు, కడుపులో నొప్పి కూడా రావచ్చు. తక్కువ మోతాదులో తినేవాళ్లంతా అన్ని సార్లూ మొత్తం పోషకాలు వచ్చేలా జాగ్రత్త పడతారన్న గ్యారెంటీ కూడా ఏమీ లేదు. ఫలితంగా రోజురోజుకూ శరీరం క్షీణించిపోయి, జీవక్రియలన్నీ కుంటుపడే ప్రమాదం ఉంది. ఒకవేళ అనివార్యమై కార్బోహైడ్రేట్లు తగ్గించినా ఆ మేరకు పీచుపదార్థంతో పొట్టను నింపాల్సిందే. లేదంటే పైన పేర్కొన్న సమస్యలన్నీ చుట్టుముడతాయి.