ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

INFORMATION ABOUT RAHU KALA PUJA


 రాహుకాల పూజ

జ్యోతిశ్శాస్త్రంలో రాహు కేతువులను సర్పాలుగా పేర్కొంటారు. రాహువు తలగా, కేతువు తోకగా సర్పాకారంలో ఉంటారు. జాతక చక్రంలో మిగిలిన ఏడు గ్రహాలూ ఈ రెండు గ్రహాల మధ్యనున్న కాలసర్పదోషంగా భావిస్తారు. అనగా 12 రాసులలో సంచరించే సూర్యుని అనుగ్రహం వారివారి జాతకరీత్యా కేవలం ఆరు రాసులకే పరిమితమై అర్ధ ఫలితాలను కల్గిస్తుంటుంది.

అన్ని రకాల చేడుయోగాలకన్నా ఈ కాలసర్పయోగం చాలా భయంకరమైంది. ఊహించని చెడు ఫలితాల్ని ఇస్తుంది. ఈ యోగం పట్టినవారు సుఖహీనులుగా, ఉద్యోగ హీనులుగా, చెడ్డ పనులు చేసేవారిగా, అవివాహితులుగా, సంతానంలేని వారిగా బాధపడుతుంటారు. ఈ చెడు ఫలితాలనుంచి బయట పడాలని ఆనందమయ జీవితాన్ని పొందాలని రాహుకాల సమయంలో గ్రహారాధన చేస్తూ ఈ పూజల్లో పాల్గొంటారు.

దేవి ఖడ్గమాలా, త్రిశతి, లలితా సహస్రనామం, శ్రీ విజయదుర్గా అష్టోత్తర శతనామాలు మొదలైన ఏదో ఒక పారాయణం చేస్తూ అమ్మవారికి ప్రితియైన నిమ్మకాయలతో ఎనిమిది దీపాలు వెలిగించి పూజను నిర్వహిస్తారు. అలా చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయని శాస్త్రం చెబుతున్నది. ఈ దేవాలయంలో ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో రహుకాలపూజను నిర్వహిస్తారు.