" ఇదుగోనోయ్ నీకు ఇష్టమని జాంగ్రీ తెచ్చా "! -భర్త
" మీ మొహం ! ఇది జిలేబీ ! జాంగ్రీ కాదు .బొత్తిగా ఇంత గుర్తు పట్ట
లేకపోతే ఎలాగండీ ఖర్మ "
" అదేకదా నా బాధ ! మన పెళ్ళి సంగతే తీసుకో ! ఫొటొలో చూసింది
నిన్ను ! పెళ్ళి చూపులికి రాగానే మీ చెల్లెల్ని చూసి నువ్వనుకుని
పిల్ల నచ్చిందన్నా ! పెళ్ళిలో మీ వాళ్ళు వెండికంచం బదులు
స్టీలు కంచం ఇస్తే వెండే కాబోలనుకోలా ? కానీ -- కానీ-- ఏం చేస్తాం "