నిర్ణయం జోక్
జనాభా లెక్కలు తీసుకునే వ్యక్తితో ఓ ఇల్లాలు ఇలా అంది:
"నాకు నలుగురు పిల్లలు అయితే ఎట్టి పరిస్ధితిలోనూ నేను ఇంకో బిడ్డని కనను" అందామె.
ఆ మాట విన్నాక, కాస్త ప్రశంసించినట్లుగా తలూపి "ఎందుకంటే, మీకు కుటుంబ నియంత్రణ గురించి కొంచమన్నా అవగాహన ఉన్నట్టుంది" అన్నాడు ఆ వ్యక్తి.
"అబ్బే! అదేం కాదు! ఈ భూగోళం మీద పుట్టే ప్రతి ఐదో వ్యక్తి చైనా దేశియుడట! మన భారతీయుల ఇంట్లో చైనా వాళ్ళ పుడితే ఏం బాగుంటుంది చెప్పండి!" అందామె.