చంపేశావ్ గదరా! జోక్
చావు బతుకుల్లో ఉన్న స్నేహితుడ్ని చూడ్డానికి హాస్పటల్ కి వెళ్ళాడు అప్పారావు. తను వెళ్ళి పక్కన కూర్చోగానే స్నేహితుడు చాలా బాధగా ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. చివరకి చెప్పలేక ఓ కాగితం తీసుకుని ఏదోరాసి అప్పారావు కిచ్చాడు.
స్నేహితుడు చనిపోయేముందు తనకేదో చెప్పాలనుకుంటున్నాడని అప్పారావు అతని వంక దీనంగా చూస్తూ ఉండిపోయాడు కానీ అది చదవలేదు. ఇంతలో స్నేహితుడు చనిపోయాడు.
ఆ తర్వాత కొన్ని రోజులకు అప్పారావుకు ఆ కాగితం గురించి గుర్తొచ్చింది. తన స్నేహితుడు చనిపోయేముందు అందరికీ ఏదో సందేశం రాసిచ్చుంటాడని దాన్ని అతని కుటుంబం కూడా చదివితే బాగుంటుందని తీసుకెళ్ళి అతడి భార్యకు ఇచ్చాడు.
ఆ కాగితం చూడగానే ఆమె కోపంతో అప్పారావు మీదికి అంతెత్తున లేచింది. విషయం అర్ధంగాక అప్పారావు ఆ కాగితం తీసుకుని చూస్తే దానిలో
"నా ఆక్సిజన్ ట్యూబ్ మీద కూర్చున్నావ్ లేవరా, చచ్చేట్టున్నా" అని వుంది.