ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

NATURAL REMEDIES FOR WINTER SEASON COLD IN TELUGU


Health tips చలికాలంలో కలిగే జలుబును తగ్గించే ఔషదాలు
చలికాలంలో జలుబు చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది.
మసాలా టీ అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది.
వేడి ఆవిరులు జలుబు నుండి త్వరిత ఉపశమనాన్ని కలిగిస్తాయి.
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండే పసుపు కూడా జలుబు తగ్గిస్తుంది.
ఇది చలికాలం. కాబట్టి.. సులువుగా జలుబు కలిగే అవకాశం అధికంగా ఉంది. ముఖ్యంగా ఆస్తమా వ్యాధి గ్రస్తులకు చలికాలంలో కలిగే సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి జలుబు వచ్చిందంటే కనీసం వారం రోజుల వరకు తగ్గదు. కానీ, ఇలాంటి సమయంలో ఇంట్లో ఉండే ఔషదాలు చాలా సహాయపడతాయి. ఇవి త్వరగా జలుబు తగ్గేలా చేస్తాయి.
లుబు వలన ముక్కు కారటం, ముక్కు బ్లాక్ అవటం మరియు శ్వాస తీసుకోటానికి ఇబ్బంది అవటం వంటి సమస్యలు కలుగుతాయి. ఇవి మన రోజు వారి కార్యకలాపాలను కూడా ప్రమాదానికి గురి చేస్తాయి. చలికాలంలో జలుబు తగ్గించే మందులను వాడిన ప్రయోజనం ఉండదు కావున ఇంట్లో ఉండే ఔషదాలను వాడటం ద్వారా జలుబు నుండి త్వరిత ఉపశమనం పొందవచ్చు. ఆ ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.
మసాలా టీ
జలుబు నుంచి తక్షణ ఉపశమనం కలిగించడంలో మసాలా టీ అద్భుతంగా పని చేస్తుంది. నీటిలో కొద్దిగా టీ పౌడర్ కలిపి, లవంగాలు, యాలకులు, అల్లం, మిరియాల పొడి కలిపి వేడి చేయండి. డికాషన్ వలే చేసిన తరువాత తాగండి. జలుబు నుండి త్వరగా ఉపశమనం పొందుటకు తేనె కూడా కలుపుకొని తాగవచ్చు. బెల్లం
బెల్లం టీ
కొద్దిగా నీటిని తీసుకొని మిరియాలను కలిపి వేడి చేయండి, మళ్ళి ఈ మిశ్రమానికి జీలకర్ర కలిపి వేడి చేయండి. తరువాత ఈ మిశ్రమానికి బెల్లం కలపండి. మిశ్రమం చల్లారిన తరువాత తాగండి. ఈ మిశ్రమం జలుబు నుండి త్వరగా ఉపశమనం అందించటమే కాకుండా, చాతి ప్రాంతంలో గడ్డకట్టిన పదార్థాలను కూడా తొలగిస్తుంది.
తేనె, అల్లం రసం
తేనె మరియు అల్లం నుండి తీసిన రసాన్ని సమన మొత్తాలలో కలపాలి. ఒకవేళ దీని రుచి నచ్చని ఎడల, ఒక గ్లాసు గోరు వెచ్చని పాలలో ఈ మిశ్రమాన్ని కలిపి తాగటం వలన జలుబు నుండి ఉపశమనం పొందుతారు. రోజు ఈ మిశ్రమాన్ని తాగటం ద్వారా ముక్కు, గొంతు భాగాలలో విశ్రాంతి పొందుతారు.
పసుపు
చలికాలంలో వేగంగా జలుబును తగ్గించుటకు అందుబాటులో ఉన్న శక్తివంతమైన ఔషదంగా దీనిని పేర్కొనవచ్చు. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండే పసుపును మరిగించే పాలలో కలుపుకొని తాగటం వలన త్వరితంగా జలుబు నుండి ఉపశమనం పొందుతారు.
అవిసె విత్తనాలు, నిమ్మ, తేనె
ఫ్లాక్స్ సీడ్స్ లేదా అవిసె విత్తనాలను నీటిలో ఉడికించాలి. ఈ మిశ్రమం చిక్కగా మారిన తరువాత, నిమ్మరసం మరియు తేనెను కలపాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని రోజులో రెండు సార్లు తీసుకోవటం వలన జలుబు నుండి త్వరగా ఉపశమనం పొందుతారు.,
వేడి ఆవిరులు
ఈ రకమైన పద్దతి గురించి దాదపు మన అందరికి తెలిసిందే. చలికాలంలో దీని వలన జలుబు మాత్రమే కాకుండా, శ్వాస సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. నీటిని మరిగించి, దుప్పటితో కప్పుకొని, ఆవిరులను పీల్చటం వలన జలుబు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.