ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TELUGU COCONUT HEALTH BENEFITS


కొబ్బరి తింటున్నారా!

ఇంట్లో కొబ్బరి ఉందంటే పచ్చడి చేయడమో, కూరల్లో వేయడమో మనలో చాలామంది చేసేదే. 

అసలు కొబ్బరి ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో తెలుసా? 

* పచ్చి కొబ్బరిలో యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నాలుగైదు ముక్కలు తింటే చాలు శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఎక్కువగా ఆటలాడే పిల్లలకూ దీన్ని పెట్టొచ్చు.

* కొబ్బరి తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. చర్మానికీ మేలు జరుగుతుంది. వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉంటాయి.

* గుండె సంబంధిత సమస్యలున్నవారు కొబ్బరి తింటే మంచిది. ఇందులో మేలు చేసే కొలెస్ట్రాల్‌ ఉంటుంది. అది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా కొబ్బరి మంచిదే.

* థైరాయిడ్‌ సమస్య ఉన్నవారు కొబ్బరి తినడం వల్ల ఆ సమస్య అదుపులో ఉంటుంది. అలానే మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌లూ తగ్గుముఖం పడతాయి.

* రాగి, సెలీనియం, ఇనుము, మాంగనీస్‌, ఫాస్పరస్‌, జింక్‌ వంటి పోషకాలు ఇందులో లభిస్తాయి. ఇవన్నీ శరీరానికి అందడం వల్ల జీవక్రియ రేటు సరిగా ఉంటుంది. ఎముకలూ, చర్మం, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

* పచ్చికొబ్బరిలో బికాంప్లెక్స్‌ విటమిన్లు, ఫొలేట్లు, రైబోఫ్లెవిన్‌, నియాసిన్‌, థయామిన్‌ లభిస్తాయి. తరచూ నోటిపూతతో బాధపడేవారు కొబ్బరి తిన్నా, కొబ్బరి పాలు తాగినా ఈ పోషకాలు అంది, ఆ సమస్య త్వరగా తగ్గుతుంది.