వీడే నా మొగుడు! జోక్
భార్యతో చెప్పసాగాడు రామ్మూర్తి.
"ఏమేవ్...ఈ రోజు ఒక పనివాడిని మాట్లాడివచ్చాను. అతను అన్ని పనులూ చేస్తాడు. అంట్లు తోముతాడు, గదుల్లో తడిగుడ్డపెడతాడు, రుచికరమైన వంటలు చేస్తాడు, ఉదయాన్నే వాకిలి ఊడ్చి కల్లాపి చల్లుతాడు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని మాటలు తిట్టినా నోరు మూసుకుని పడుండే మెత్తటి మనిషి..."
"అలాగయితే వేరే పనివాడ్ని చూడండి నాన్నా..." తలుపు చాటునుండి నెమ్మదిగా అంది కూతురు.
"ఏమ్మా.. ఇతను అన్ని పనులు చేస్తాడంటున్నగా. వేరే పనివాడెందుకు?" ఆశ్చర్యంగా అడిగాడు రామ్మూర్తి.
"ఇతన్ని నేను పెళ్ళి చేసుకుంటాను నాన్నా..." చెప్పింది కూతురు.