ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

MAHA SIVARATHRI FESTIVAL SPECIAL TELUGU ARTICLE - ANTHA SIVA MAYAM BY SRI SOMA SEKHAR


అంతా శివమయం

నిరాకార రూపుడైన శివుడు.. భారతావనిలో పన్నెండు ప్రదేశాల్లో జ్యోతిర్లింగ స్వరూపునిగా వెలిశాడు. మన దేశానికి నాలుగు దిక్కులా ఈ జ్యోతిర్లింగ ఆలయాలున్నాయి. వాటిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందులో ఒక్క లింగాన్నైనా దర్శించుకోగలిగితే అనంతకోటి పుణ్యం లభిస్తుందని పెద్దల వాక్కు. శివరాత్రి పర్వదిన వేళ.. వాటి గురించి మరిన్ని విశేషాలు.. Soma Sekhar

తైత్తీరియో ఉపనిషత్తును అనుసరించి మనిషిలోని పన్నెండు తత్వాలే ఈ జ్యోతిర్లింగాలు. అవేంటంటే..

1. బ్రహ్మ 2. మాయ 3. జీవుడు 4. మనసు 5. బుద్ధి 6. చిత్తం 7. అహంకారం 8. పృథ్వి 9. జలం 10. తేజస్సు 11 వాయువు 12. ఆకాశం Soma Sekhar

#జ్యోతిర్లింగాలు_ఎక్కడెక్క..

* సముద్రపు ఒడ్డున రెండు (బంగాళాఖాతం తీరాన #రామేశ్వరం, ఆరేబియా ఒడ్డున #సోమనాథాలయం)

* పర్వతసానువుల్లో నాలుగు (శ్రీశైల శిఖరాన #మల్లికార్జున, హిమాలయాల్లో #కేదారేశ్వరుడు, సహ్యాద్రి పర్వతాల్లో#భీమశంకరుడు, మేరు నగపై #వైద్యనాథుడు )

* మైదానాల్లో మూడు (దారుకావనంలో #నాగేశ్వరలింగం, ఔరంగబాద్‌ - #ఘృష్ణేశ్వర, ఉజ్జయిన నగరాన -#మహాకాలేశ్వరుడు)

* నదులు తీరాన మూడు (గోదావరి ఒడ్డున #త్రయంబకేశ్వరుడు, నర్మదా నదీతీరాన #ఓంకారేశ్వరుడు, గంగానదీ తీరాన#విశ్వేశ్వరుడు)

జ్యోతిర్లింగ రూపాల్లో ఉన్న ఆ లింగాలు పరమశివుని తేజస్సు అని పురాణాలు చెబుతున్నాయి. ద్వాదశాదిత్యులకు ప్రతీకలుగా భావిస్తారు. లయకారుడైన పరమశివుడు స్వయంభువుగా వెలిసిన దివ్యక్షేత్రాలుగా ఇవి పేరొందాయి. Soma Sekhar

#సోమనాథ జ్యోతిర్లింగం :
గుజరాతలోని వీరావల్‌ దగ్గరున్న ప్రభాస పట్టణంలో సోమనాఽథ ఆలయం ఉంది. చంద్రుని కీర్తిని దశ దిశలా వ్యాప్తి చెందించుటకు శివుడు సోమనాథునిగా ఇక్కడ వెలిశాడని స్థల పురాణం. Soma Sekhar

#మల్లిఖార్జున జ్యోతిర్లింగం :
ఇది ఆంద్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో ఉంది. పర్వతుడనే రుషి తపఃఫలంగా ముక్కంటి ఇక్కడలింగ రూపంలో ఆవిర్భవించాడని స్థానిక కథనం. ఆది శంకరుడు ‘శివానందలహరి’ని ఇక్కడే రాశాడని చెబుతారు. Soma Sekhar

#మహాకాళే శ్వర జ్యోతిర్లింగం :
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉందీ క్షేత్రం. స్మశానం, ఎడారి, పాలపీఠం, అరణ్యం ఉన్న ప్రదేశం ఉజ్జయిని. అందుకే అన్ని క్షేత్రాల్లో కంటే మహాకాళేశ్వరం అత్యుత్తమైందిగా భక్తులు భావిస్తారు. Soma Sekhar

#కేదారనాథ్ ఆలయం :
ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో మందాకిని నదీ సమీపంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం పర్వత రాజైన హిమవంతుని కేదార నామ శిఖరంపై ఉండటంతో ఇది కేదార జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది.శీతాకాలంలో అక్కడ ఎక్కువగా మంచు కురుస్తుంది. వాతావరణ పరిస్థితులు కారణంగా ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ మధ్య కాలంలో మాత్రమే దీన్ని సందర్శించవచ్చు. Soma Sekhar

#నాగేశ్వర దేవాలయం :
మరో జ్యోతిర్లింగ క్షేత్రం ద్వారకవనంలో వెలిసిన ‘నాగేశ్వర లింగం’. ఒంటినిండా సర్పాలనే వస్ర్తాలుగా చుట్టబెట్టుకుని శివుడు ఈ తీర్థాన కొలువైనందున ‘నాగేశ్వరుడి’గా పూజలందుకుంటున్నాడు. పతి వెంటే సతీ అన్నట్లుగా... పార్వతీదేవి ఇక్కడ నాగేశ్వరిగా కొలువు తీరింది. గుజరాత పోరుబందర్‌ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఈ తీర్థముంది. Soma Sekhar

#రామేశ్వరం :
తమిళనాడులోని ‘రామేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం’ పరమపవిత్రమైందిగా ప్రసిద్ధి గాంచింది. రామేశ్వర దర్శనం చేసుకుంటే.. కాశీ యాత్ర చేసినంత ఫలితం వస్తుందని పెద్దల మాట. ఈ ఆలయంలో 36 తీర్థాలు ఉండటం విశేషం. బంగాళాఖాతంలో శంఖు ఆకారంలో ఉండే చిన్న ద్వీపం రామేశ్వరం. Soma Sekhar

#ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం :
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ స్వామిని కొలిచిన వారికి సంతాన నష్టం ఉండదు. అకాల మరణ దోశం కూడా తొలగిపోతుందట. జ్యోతిర్లింగాల్లో ఇది పన్నెండో జ్యోతిర్లింగం. Soma Sekhar

#త్రయంబకేశ్వర దేవాలయం :
పరమ పవిత్ర నది గోదావరి పుట్టిన చోట ఈ క్షేత్రం ఉంది. త్రయంబకేశ్వరుని పూజిస్తే.. ప్రమాదాలతో పాటు, అకాల మృత్యుదోషాలు తొలగుతాయని స్థలపురాణం చెబుతోంది. ఈ లింగం చెంతనే మూడు చిన్న లింగాలు ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతిరూపాలే ఆ లింగాలు. అందుకే ఈ క్షేత్రం త్రయంబకేశ్వర పేరుతో విరాజిల్లుతోంది. Soma Sekhar

#వైద్యనాథ దేవాలయం :
జార్ఖండ్‌లోని దేవ్‌ఘడ్‌లో వైద్యనాథ ఆలయం ఉంది. ఈ స్వామిని పూజించిన వారికి సకల రోగాలు సమసిపోతాయని భక్తుల నమ్మకం. ఈ దేవాలయాన్ని రాణి అహల్యదేవి అభివృద్ధి చేసినట్టుగా అక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయంలోని శివలింగ శిరస్సుపై ఉన్న నొక్కును రావణాసురుని బొటన వేలు నొక్కుగా చెబుతారు. Soma Sekhar

#భీమశంకర జ్యోతిర్లింగం :
మహారాష్ట్రలోని భీమశంకర్‌లో కలదు. పూణె నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఇది ఇంది. కృష్ణానదికి ఉపనదిగా ఉన్న భీమనది ఇక్కడే పుట్టింది. ఈ నది పేరుమీదనే ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది. Soma Sekhar

#కాశీ విశ్వనాథ దేవాలయం :
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పరమేశ్వరుడు విశ్వేశ్వర జ్యోతిర్లింగంగా అవతరించాడు. పవిత్ర గంగానదీ తీరంలో ఈ క్షేత్రం ఉంది. వరుణ, అసి నదులు గంగానదిలో సంగమించిన ప్రదేశం ఇది కనుక వారణాసిగా చరిత్రకెక్కింది. ‘కాశి వంటి పుణ్య క్షేత్రం, తల్లి వంటి దైవం, గాయత్రి వంటి మంత్రం’ లేదు అని ఓ నానుడి.Soma Sekhar

#ఓంకారేశ్వర ఆలయం :
ఈ ఆలయం మధ్యప్రదేశ్‌, ఖాండ్వాలో నర్మదా నదీ తీరాన మంధాత పర్వత ప్రాంతంపై కొలువై ఉంది. ఇక్కడి లింగం చుట్టూ ఎప్పుడు నీళ్లు ఆవరించి ఉండటం విశేషం. ఈ దేవాలయం కృత యుగం నాటిది. Soma Sekhar