ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TYAGASEELI - GARUTHMANTHUDU BY SRI SOMASEKHAR


త్యాగశీలి గరుత్మంతుడు

మహావిష్ణువు గరుత్మంతుని దగ్గరకు వచ్చి.. ”ఓయి గరుత్మంతా! నీవు ఈ అమృతాన్ని చేజిక్కించుకుని సేవించకుండా ఎక్కడికి వెళుతున్నావు? అని అడిగితే నాకు ఈ అమృతం వద్దు కాని మా అమ్మ దాస్య విముక్తి కోసం నాగులకు ఇవ్వడం కోసం తీసుకువెళ్తున్నాను.” అని చెప్పాడు. ”స్వామి నీ దర్శనం లభించింది. చాలు. ఇంక ఏ వరాలు నాకు వద్దు. కాని నీవు ఇస్తానంటున్నావు కనుక నేను సదా నీ సేవలో ఉండే భాగ్యాన్ని కలుగచేయి” అని అడిగాడు. మహావిష్ణువు తథాస్తు అన్నాడు.Soma Sekhar

నిరంతరాన్వేషి మనిషి. ఆది మానవుని నుంచి నేటి దాకా మనిషి అన్వేషణ సాగిస్తూనే ఉన్నాడు. ఇలా పరిశీలించి, పరిశోధించి కనుగొన్న నిజం ఏమిటంటే కులం కన్నా గుణం మిన్న అని. ఆ గుణాలలో కూడా త్యాగం గొప్పదని కొందరన్నారు. ఆ త్యాగ గుణం గురించి ఎన్నో కథలను మహా భారతం మనకందిస్తోంది. వాటిలో ఒకటి వినత, కద్రువల కథ. కశ్యప మహర్షికి ఇద్ద్దరు భార్యలు. వారు వినత, కద్రువ. వీరిద్దరి నుంచి సంతానం కోసం కశ్యపుడు తీవ్ర తపస్సు చేశాడు.ఆ తర్వాత పుత్ర కామేష్టి యాగం కూడా చేశాడు. Soma Sekhar

భార్యలిద్ద్దరిని పిలిచి మీకెలాంటి కుమారులు కావాలో చెప్పమన్నాడు. కద్రువ తనకు బలవంతులు, పొడవైన శరీరం కలవారు, అమేయమైన శిక్తి కలవారు, వారు కూడా వెయ్యి మంది కావాలనంది. వినత మాత్రం తనకు ధర్మ పరాయణులు, సత్యం పలికేవారు, బహు శక్తిమంతులు అయిన ఇద్ద్దరు కొడుకులు చాలని అంది. సత్య ధర్మ పరాయణులు కానిదే ఎంత బలమున్నా ఒకటే. ఆ బలమంతా అధర్మాచరణకు వినియోగిస్తే చివరకు నారాయణుని చేతిలో చావు తప్పదు. Soma Sekhar

జనన మరణ చక్రంలో ఇరుక్కోక తప్పదు. అనేక జన్మల పుణ్యాన్ని వ్యయం చేస్తే వచ్చిన నర జన్మ కాస్తా వృధా అయిపోతుంది. కశ్యపుడు భగవదునుగ్రహంతో వారి అండాలను బయటకు రప్పించాడు. వాటిని నేతి కుండల్లో భద్రపరిపించాడు. వాటి నుంచి మీరు కోరుకున్న పుత్రులు జన్మిస్తారని చెప్పి తపస్సమాధిలోకి వెళ్ళిపోయాడు. (అండాలను నేతి కుండల్లో పెంచడం అన్నది దుర్యోధనుడు అతని సోదరులు జన్మించిన సమయంలో కూడా జరిగింది. దానిని ప్రస్తుత కాలంలో ఉన్న టెస్ట్‌ ట్యూబ్‌ బేబీని పోలిన సాంకేతిక ప్రక్రియగా భావించవచ్చు). కొంత కాలానికి కద్రువకు చెందిన వెయ్యి అండాల నుంచి వేయి మంది నాగులు పుట్టుకొచ్చారు. Soma Sekhar

వారిన చూసి కద్రువ మహదానందపడిపోయింది. అయితే వినత అండాల నుంచి ఎంతకీ ఎవరూ బయటకు రాలేదు. దానితో ఆమె తన రెండు అండాల్ల్లో ఒక దానిని పగులగొట్టింది. దానిలో నుంచి సగం దేహంతో తయారైన ఒక యువకుడు బయటకు వచ్చాడు. అతనికి తొడ కింద నుంచి శరీరం లేదు. అతని రూపం చూసి వినత చాలా బాధపడింది. అప్పుడు ఆ యువకుడు అమ్మా! నేను పూర్తిగా రూపొందక ముందే నీవు అసూయ వల్ల్ల నన్ను బయటకు రప్పించావు. కనుక నువ్వు ఎవరిని చూసైతే అసూయ చెందావో వారికి దాసివైపోవుగాక’ అని శపించాడు. ధర్మానికి బంధుత్వాలు ఉండవని, కన్న తల్లి అయినా కఠినంగా శిక్షించాడు. Soma Sekhar

వినత తన తప్పు తెలుసుకుంది. క్షమించమని, రాగల దాసీత్వం నుంచి తప్పించమని కోరింది. ధర్మ పరాయణులు ఎప్పుడూ శాంతికాముకులు గానే ఉంటారు. ఉత్త్తములకు కోపం క్షణ కాలమే ఉంటుంది, అందువల్ల ఆయన ‘నా తమ్ముడిగా వచ్చే వాణ్ని తొందరపడి ఏమీ చేయకు. ఆ అండాన్ని పూర్తిగా ఫలించనివ్వు. అందులో నుంచి ఉత్తముడే కాక మన వంశానికి కీర్తి తెచ్చేవాడు నీ కుమారుడిగా పుడతాడు, వాడే నీ దాసీత్వాన్ని పోగొడతాడు అని శాప విమోచన విధానం చెప్పాడు. ఆ అనూరుడే సూర్యుని రథ సారథుల్లో ఒకడు). Soma Sekhar

ఇలా కాలం గడుస్తుండగా ఒక సాయం సంధ్యాకాలంలో కద్రువ, వినత వాహ్యాళికి వెళ్లారు . ఆ సమయంలో వారు దూరంగా దేవలోకంలో ఉండే ఉచ్చైశ్రవం లాంటి తెల్లని గుర్రాన్ని చూశారు. ఆ గుర్రం తెల్ల దనానికి అబ్బురపడ్డారు. అయితే దాని వర్ణనలో ఒకరిని ఒకరు మించి పోవాలని భావించారు. గుర్రం తెల్లగా ఉన్నా తోక మాత్రం నల్ల్లగా దాని అందానికి మచ్చలా ఉందని కద్రువ అంది. అటువంటి మచ్చేది కనబడలేదంది వినత. దానికి కద్రువ పందెం వేసుకుందామా అంది. మచ్చ లేకుంటే నేను నీకు దాసినవుతా, మచ్చ ఉంటే నువ్వు నాకు దాసివి కావాలి అని సవాలు విసిరింది. Soma Sekhar

కద్రువ పందెం కాచినా గుర్రం తోక తెల్లగా ఉందని ఆమెకూ తెలుసు. అందువల్ల కుమారులను పిలిచి మీలో నల్ల్లగా ఉన్న వారు వెళ్లి ఆ తోకను చుట్టుకుని ఉండి అది నల్లగా కనబడేలా చుట్టుకుని ఉండండి అని కోరింది. దానికి వారు ‘ఇంత అధర్మం మేము చేయం’ అని నిరాకరించారు కద్రువకు కోపం వచ్చింది. మీరంతా మునుముందు జనమేజయుడు చేసే సర్ప యాగంలో పడి మర ణించండి అని శపించింది. నాగుల్లో కొందరు భయపడ్డారు. ఇరుకున పడినవారు తమ తల్లిని క్షమించమని కోరారు. మేము నువ్వు చెప్పిపట్లే చేస్తాం శాపాన్నివ్వకు అన్నారు. అయితే నా మాట విన్న వారకి శాపం తగలదని చెప్పింది. ఇలా కద్రువ మాట విన్నవారు ఆ తోకకు చుట్టుకున్నారు. ఆ సమయంలోనే కద్రువ, వినత మళ్లిd దూరంగా ఉన్న గుర్రాన్ని చూశారు. Soma Sekhar

వెంటనే కద్రువ ఆ తోక నల్లగా ఉంది. నువ్వు నాకు దాసివవ్వాలి అంది. అప్పటి నుంచి కద్రువకు వినత దాసి అయింది. కొన్నాళ్లకు వినత అండం నుంచి గరుత్మంతుడు పుట్టాడు కాని అమ్మ దాసి తనం వల్ల తాను కూడా కద్రువ సంతానమైన నాగులకు దాసీపుత్రుడుగానే ఉండేవాడు. తన తల్లి పడే క ష్టాన్ని చూచాడు. ఎంతో దు:ఖించాడు. తనకు అమ్మయైన వినత దు:ఖించడం బాగలేదనుకొన్నాడు. ఆ గరుత్మంతుడు నాగుల దగ్గరకు వెళ్లి మా అమ్మను దాస్యం నుంచి తప్పించమని కోరాడు. దానికోసం మీకు నేను ఏదైనా పని చేస్తా ను అన్నాడు. నాగులందరూ ఆలోచించారు. అమ్మ శాపం ఇచ్చింది కదా దాని నుంచి కూడా రక్షించబడాలి అనుకొంటే దేవతల దగ్గర ఉన్న అమృతాన్ని మనం తాగితే చాలు అనుకున్నారు. Soma Sekhar

అందుకే ”ఓ గరుత్మంతా నీవు ఆ ఇంద్రుని రక్షణలో ఉన్న అమృతాన్ని మాకు తెచ్చివ్వు.. అపుడు నీకు మీ అమ్మకు దాస్యం నుంచి విముక్తి పొందగలవు” అని అన్నారు. ‘అమృతాన్ని తెచ్చి మీకిస్తాను’ అని గరుత్మంతుడు వాళ్ల అమ్మకు చెప్పి దేవలోకానికి వెళ్లాడు. అక్కడ అమృత రక్ష కులుగా ఉన్న వారితో యుద్ధం చేసి అమృత కలశాన్ని తీసుకొని వేగంగా నాగుల దగ్గరకు బయలు దేరాడు. దేవతలంతా ఈ విషయాన్ని మహావిష్ణువుకు చెప్పారు. మహావిష్ణువు గరుత్మంతుని దగ్గరకు వచ్చి.. ”ఓయి గరుత్మంతా! నీవు ఈ అమృతాన్ని చేజిక్కించుకుని సేవించకుండా ఎక్కడికి వెళుతున్నావు? అని అడిగితే నాకు ఈ అమృతం వద్దు కాని మా అమ్మ దాస్య విముక్తి కోసం నాగులకు ఇవ్వడం కోసం తీసుకువెళ్తున్నాను.” అని చెప్పాడు. ”స్వామి నీ దర్శనం లభించింది. చాలు. ఇంక ఏ వరాలు నాకు వద్దు. కాని నీవు ఇస్తానంటున్నావు కనుక నేను సదా నీ సేవలో ఉండే భాగ్యాన్ని కలుగచేయి” అని అడిగాడు. Soma Sekhar

మహావిష్ణువు తథాస్తు అన్నాడు. మహావిష్ణువు ”గరుత్మంతా ఇంకో విషయం విను. అమృతం దుష్టులకు లభ్యం కాదు. అందుకని నీవు ఆ నాగులతో ఈ అమృతాన్ని తీసుకోవడానికి ముందు శుచులై ఉండాలి. స్నానానంతరం తీసుకోమని చెప్పు. అంతలో నేను ఈ అమృతాన్ని తీసుకొని పోతాను” అని చెప్పాడు. అపుడు గరుత్మంతుడు ”ఓ వైకుంఠ వాసా! నేను వారికి అమృతాన్ని తెచ్చి ఇస్తాను అని చెప్పాను. వారికి నేను ఇచ్చి నీవు చెప్పిన మాట చెబుతాను. ఇక భారం నీదే” అని చెప్పాడు. ఆ తర్వాత గరుత్మంతుడు నాగులకు అమృతాన్ని ఇవ్వడం మహావిష్ణువు చెప్పి నట్లు చెప్పడం జరిగింది. వాళ్లు సంతోషంతో నీకు మీ అమ్మకు నేటి నుంచి దాస్య విముక్తి కలిగింది. Soma Sekhar

మీరిద్దరూ వెళ్లి పొండి అని చెప్పారు. ఇలా గరుత్మంతుడు వాళ్ల అమ్మకు దాసీతనాన్ని దూరం చేశాడు. గరుత్మంతుడు చేసిన పనికి మహావిష్ణువే మెచ్చి తన వాహనంగా చేసుకొన్నారు. ఇక నాగులు గరుత్మంతుడు చెప్పిన దాన్ని విని ఓ దర్భల చాపపైన అమృతాన్ని పెట్టమన్నారు. వారు సముద్ర స్నానానికి వెళ్లి వచ్చి తీసుకొందాం ఇక మనదే కదా ఆ అమృతం అను కొన్నారు. సముద్ర స్నానానికి వెళ్లారు. అంతలో మహావిష్ణువు వచ్చి అమృతక లశాన్ని తీసుకొని వెళ్లారు. దాన్ని చూచిన నాగులు గబగబా వచ్చి ఆ దర్భలపై అమృతం ఉందేమోననుకొని దాన్ని నాకారు. Soma Sekhar

ఆ దర్భల పదునుకు ఆ నాగుల నాలుకలు రెండుగా చీలాయి. కాని అమృతపు చుక్కలు దర్భలపైన ఉండడంతో వారు బతికి పోయారు. ఆశ ఉండవచ్చు కాని దురాశ ఉండకూడదు. దురాశ దు:ఖానికి చేటు అంటే ఈ నాగుల చరిత్రే ఉదాహరణ కదా.. అందుకే మనకు ఉన్నదానితో తృప్తిపడితే దాన్ని మించిన స్వర్గం ఉండదు. మనం మంచి పనులు చేస్తే ఆ పనుల వల్ల ఇతరులకు కలిగే సంతోషమే మనకు అమరత్వాన్ని తెచ్చి పెడుతుంది అనడానికి గరుత్మంతుడే చక్కని ఉదాహరణ కదూ. Soma Sekhar