ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

A TRIBUTE TO SRI RAJANALA KALLAYYA - TOLLYWOOD CINE ARTIST - ARTICLE BY SRI THOTA RAVI KUMAR GARU


1948 సంవత్సరం నెల్లూరు టౌన్ హాలు లో నేషన్ ఆర్ట్ థియేటర్ అనే నాటకసంస్థ "ఎవరుదొంగ" అనే నాటకాన్ని ప్రదర్శిస్తుంది..అందులో రాజనాల.కల్లయ్య అనే రెవెన్యూ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగులలో ఉండే అవినీతిని ఎండగడతూ అద్భుతంగా నటిస్తున్నాడు..ఆ నాటకానికి హాజరైన నెల్లూరుజిల్లా కలెక్టర్ కోపంతో ఊగిపోయాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగివైవుండి ఇలా విమర్శంచడం చట్టవిద్దమంటూ కల్లయ్యను హెచ్చరించాడు...
కానీ అతని మాటలు లెక్కచేయకుండా తర్వాత "ప్రగతి" అనే నాటకాన్ని ప్రదర్శించారు.. దానితో జిల్లా కలెక్టర్ కల్లయ్యను జాబ్ నుండి సస్బెండ్ చేశారు..
సత్యాన్ని తొక్కిపెడితే ప్రయోజనం ఏమిటంటూ కలెక్టర్ గారిని ప్రశ్నించిన కల్లయ్యా మళ్ళీ జాబ్ లో చేరేందుకు ఇష్టపడలేదు...ఆ కల్లయ్య గారే తెలుగుసినీపరిశ్రమలో "రాజనాల"గా పేరుపొందిన రాజనాల.కాళేశ్వరరావుగారు.

రాజనాల గారు నెల్లూరుజిల్లా కావలిలో 1928 జనవరి 3 న జన్మించారు..మంచి ఉన్నతికుటుంబం. చిన్నతనం నుండి అభ్యుదయభావాలు కలవారు..ఇంటర్ చదివేరోజులలో నాటకసంస్థను స్థాపించారు..ఉద్యోగం మానేసిన తరువాత 1953లో తన స్నేహితుని సహాయంతో బియన్ రెడ్డి దగ్గర నెలకు ₹200 జీతంతో ప్రతిజ్ఞ అనే సినిమా విలన్ గా నటించారు...అది మంచి హిట్ కావడంతో తెలుగుసినిమాలో స్టార్ నటుడి స్తాయికి ఎదిగారు..జరాసంధుడు,కంసుడు,దుర్యోధనుడు,మాయలఫకీరు,దొంగలనాయకుడు, భూకామంధు, హాస్యవిలన్ లాంటి వైవిధ్య భరితమైన పాత్రల ద్వారా ప్రేక్షకులకు ఎంతో దగ్గరైనాడు,.ఒకానొక సమయంలో హీరోలతో సమానంగా పారితోషికం అందుకున్నారు.. 1966 మాయా ది మెగ్నిఫిషియంట్ అనే హాలీవుడ్ సినిమాలో నటించి..హాలీవుడ్ లో నటించిన తొలి తెలుగు నటుడైనాడు..దాదాపు 25 సంవత్సరాలు తెలుగుసినీరంగంలో తనదైన ముద్రవేశాడు..45 సంవత్సరాలు రాజభోగాలనుభవించారు...నటనకు విలనేగాని మనసుమాత్రం వెన్న. ఎంతోమంది పేదకళాకారులకు ఆర్థికచేయూతనిచ్చారు, చాలామంది పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇచ్చి చదివించారు..ఇంటికి వచ్చి చేయ చాచిన ప్రతి ఒక్కరికి సహాయం చేశారు..
"హాయిగా సాగుతున్న ప్రయాణంలో 1979 లో అతని భార్య చనిపోవడంతో ఒక్కసారి మార్పు కనిపించింది..మెల్లమెల్లగా ఆస్థులన్నీ కరిగిపోవడం ప్రారంభమైనాయి..1982లోపెద్ద కొడుకు మరణం, 1984లో రెండో కొడుకు ముంబాయ్ లో అదృశ్యం మానసికంగా అతనిని కృంగతీశాయి.. చెన్నైలోని ఆస్థులను అమ్మి స్నేహితుల సహాయంతో హైదరాబాద్ లో రూబీ అపార్ట్ మెంట్ లో ఒక చిన్న ప్లాట్ తీసుకున్నాడు...మానసిక క్రుంగుబాటు..ఆర్థిక ఇబ్బందులతో చాలా ఇబ్బందులు పడ్డారు.1995 లో తెలుగు వీర లేవరా అనే సినిమా షూటింగ్ అరకులో గాయపడినాడు.. మధుమేహం వుండటంతో కాలు ఇన్ఫెక్షన్ అయి కాలుతీసివేయాల్సివచ్చింది.
చివరి రోజులలో జ్యోతిష్కం, మోహూర్తాలు చెప్పుకుంటూ మే 21 1998 లో మరణించారు.

మహానటుడు,, యన్ టి ఆర్ ,ఏయన్నార్ లాంటి హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న నటుడు.. చేయి చాసిన ప్రతి ఒక్కరికీ సహాయంచేసిన మంచివ్యక్తి...రాజభోగాల నుండి అత్యంత దయనీయమైన కష్టాల జీవితం అనుభవిస్తూ తనువు చాలించడం ..ఎవరికైనా కన్నీరు పెట్టించక మానదు...అందుకే అంటారు జీవితమనేది ఎలా ప్రారంభై ఎలా ముగుస్తుందో తెలియదు...ఈయన కష్టాలకు గుప్తధానాలు కూడా కారణమంటారు...అయితే రాజనాల.కాళేశ్వరనాయుడు మహానటుడు అనడంలో సందేహం లేదు..

"రాజనాలగారి జ్ఞాపకార్థం.

BRIEF BIODATA OF TELUGU CINE ARTIST RAJANALA