ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SRI VENKATACHALA MAHIMA - TELUGU BHAKTHI KADHA


శ్రీవేంకటాచల మహిమ

పూర్వము కాంభోజ దేశమును శంఖణుడను రాజు యేలుచుండెను. ఆ రాజు చాలా ధర్మాత్ముడు. భార్యయూ మంచి గుణవంతురాలు. కొన్నాళ్ళకు శత్రురాజులందరూ యేకమై శంఖణుని మీదికి యుద్ధమునకు వచ్చిరి. శంఖణుడు యుద్ధమున వారిని ఢీకొని పోరాడుచుండెను. శంఖణుడు ఒక్కడు వారు పదిమంది, బలవంతమైన సర్పమైననూ చలిచీమల చేతచిక్కి చావదా? అన్నట్లు యెంత బలవంతుడైననూ పదుగురను జయింపలేడు. అందువలన శంఖణుడు శత్రువులకు వోడిపోయి తన రాజ్యమును విడిచి భార్యతో కట్టుబట్టలతో అరణ్యము పాలైనాడు.
శంఖణుడు రామేశ్వరము మొదలైన యాత్రలు చేసి, సేవించి, పవిత్రమైన అలివేలు మంగాపురము జేరి, పద్మసరోవరతీర్థములో నిత్యము స్నానము చేయుచూ తనకు గల్గిన ఆపదలను గూర్చి విచారించు చుండెను. ఒకనాడు ఆకాశవాణి "మహారాజా దుఃఖము పొందకుము. శ్రీవేంకటాచలమునకు పోయి అందుగల పుష్కరిణిలో స్నానమాడి శ్రీ వేంకటేశ్వరుని పూజింపుము. నీ దుఃఖము తీరి విజయము కల్గు" నని చెప్పెను.
శంఖణుడు సంతోషముతో భార్యను వెంటబెట్టుకొని వేంకటాచలము జేరి, పుష్కరిణిలో స్నానమాడి శ్రీ వేంకటేశ్వరుని తులసితో పూజించెను. స్వామికి అతనిపై అనుగ్రహము కలిగి "రాజా! నీకు మరల రాజ్యప్రాప్తి గల్గును" అని సెలవిచ్చెను.
శంఖణుడు భార్యతో తన రాజ్యము జేరి శత్రువులను సంహరించి రాజ్యమును సంపాదించుకొని సుఖపడెను.