ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

CHEESE BALLS

చీజ్ బాల్స్

కావాల్సినవి:
బంగాళా దుంపలు-పావు కేజి
నిమ్మకాయ-ఒకటి
మిరియాలపొడి-అర టీ స్పూన్
చీజ్- 150 గ్రా
మీగడ-50మీ.లీ
కోడిగుడ్డు-ఒకటి
బ్రెడ్ పొడి-అర కప్పు
నూనె-వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం:
1 )బంగాళా దుంపల్ని మెత్తగా ఉడికించి మెదిపి ముద్దగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి.
2)ఈ ముద్దలో ఉప్పు,మిరియాల పొడి,నిమ్మ రసం కలిపి వుంచుకోవాలి.
3)చీజ్ ను తురిమి అందులో మీగడ కలిపి ఉండలు గా చేయాలి.
4)ఒక్కో ఉండకు బంగాళా దుంప మిశ్రమాన్ని అద్దుతూ గుండ్రని బంతుల్లా చేయాలి.
5)కోడిగుడ్డును పగులగొట్టి సొనను బాగా గిలకొట్టాలి.ఇప్పుడు ఈ ఉండాలని సోనలో ముంచి బ్రెడ్ పొడి లో దొర్లించి నూనెలో వేయించి తీయాలి.వేడి వేడి చీజ్ బాల్స్ రెడీ..ఇవి సాస్ తో తింటే బావుంటాయి....