ఆడవాళ్ళకు చీరలోనే అసలైన అందం
3
చీరకట్టు ఎరగని భారతీయులుగానీ, చీరకట్టు అంటే ముచ్చటపడని విదేశీయులుగానీ లేరనడంలో సందేహం లేదు. ప్రతినిత్యం ఏదో ఓ కొత్తదనం కోసం పాకులాడుటం మానవనైజం. అవి కట్టు, బొట్టు విషయంలోకావచ్చు, వేరే ఏ ఇతర విషయాలలోనైనా కావచ్చు. చూస్తున్న ప్రతిసారి ఏదో కొత్త సొంపు, సోయగం, హుందాతనం కలిగి, మరుగునపడడం కాదు. కనీసం తెరమరుగున పడటం అంటే కూడా ఎరగని సిసలైన సాంప్రదాయక సౌందర్యం చీరదే. మన డిజైనర్లు కూడా చీరపై ఉన్న మక్కువతో, దాదాపు ప్రతి ప్యాషన్‌షోలోనూ ఒక మోడల్‌తోనో, సినీతారతోనో చీరతో క్యాట్‌వాక్ చేయిస్తున్నారు. డిజైనర్ల దాకా ఎందుకు. చీరలపై తమకు గల మక్కువను నాటి నుండి నేటి దాకా ఎందరో కవులు తేటతెల్లం చేసిన సంగతి అందరికీ విదితమే ”చీరగట్టి సింగారించి చెంగావి రంగుచీర, సరికొత్త చీర ఊహించినాను అంటాం. ఈ చీర పాటలు అందరి మనసులను అలరించాయి, కిన్నెరసాని వలపు చూడాలన్నా ఎంకి కడియం మెలగాలన్నా అది చీరకే సాధ్యం మరి.
ప్రాణమొచ్చిన బొమ్మకైనా కులుకు చెప్పే బొమ్మకైనా నిండుదనం చేకూర్చది చీరే. ఈ చీర గురించి చెప్పాలంటే మాటలేదు, చదవాలంటే భాషలేదు. ఎంత చెప్పినా ‘ఇంతేనా’ అనిపించే చరిత్ర మన చీరకుంది. నారచీర నుండి పట్టుచీర వరకూ దేని అందం దానిదే. దేని సోయగం దానిదే. పాశ్చాత్య నాగరికత మోజులో చీరకట్టుకోవడం కూడా చేతకాదంటూ అమాయకంగా ముఖం పెడుతోంది నేటియువత. పాపం వారిపై జాలితోనో లేక మన సంప్రదాయక సౌందర్యాన్ని ఎక్కడ మిస్ చేసుకోంటోరో అనే బాధతోనో తెలియదు కానీ మామూలు డ్రస్సులా, రెడీమేడ్‌గా చీరను ”తొడుక్కునే” విధంగా కూడా డిజైన్ చేశారు మన డిజైనర్లు. ప్రపంచ దేశాల్లో ఫ్యాషన్ రారాజుగా వెలుగొందుతున్న ప్యారిస్‌లో కూడా ఈ చీర కట్టుకు అభిమానులున్నారు.
భారతీయులమై కనీసం చీర కుట్టకోవడం నేర్చుకోవడం మన బాధ్యత. కాబట్టి అమ్మాయిలు చీర కట్టుకోవడం రాదని మాత్రం చెప్పకండీ. విదేశీయులు వింటే నవ్విపోతారు. చీర, చీర అంటున్నాం, అసలేంటీ చీర అంటే, దీర్ఘ చతురస్రాకారంలో ఉండే ఒక వస్త్రం మాత్రమే. ఐదు నుండి ఆరు గజాల పొడువుండి ఎటువంటి శరీరాకృతి కలవా రికైనా సరిపోయే గుణం దీనికుంది. చీరల రంగు, టెక్చర్, ప్రింట్స్, వర్క్స్ వీటిని బట్టి అవి ఏప్రాంతానివో ఇట్టే చెప్పొచ్చు. ఈ చీరను ఎన్నో రకాలుగా ధరించొచ్చు. చీర ధరించిన విధానాన్ని బట్టి ఆయా వ్యక్తుల హోదా, వయస్సు ఎన్నో అంచనా వేయొచ్చు.
చీరలు కొనడం నుండి, కట్టుకోవడం వరకు
హెవీ పర్సనాలిటీ ఉన్నవారు షిఫాన్, జార్జెట్‌ల్లో చీరలు ఎంపిక చేసుకొండి. హెవీ మైసూర్ శారీస్‌లో అందంగా, స్లిమ్‌గా కనబడతారు.
తక్కువ హైట్ ఉన్నవారు సన్నని బోర్డర్స్ ప్రిఫర్ చేసే మంచిది. అసలు బోర్డర్‌లేని చీరలు కూడా బాగుంటాయి. అలా కాకుండా హెవీ బోర్డర్స్ తీసుకుంటే ఉన్న దానికంటే స్మార్ట్‌గా కనబడతారు. కాబట్టి హెవీ బోర్డర్స్ తీసుకోపోవడం మం
సన్నటి వారు ఆర్గాన్‌జా, టిష్యూ, కాటన్, టస్సర్ శారీస్‌లో నిండుగా కనబడతారు.
ఫంక్షన్ వెళ్లాలనుకున్నప్పుడు ఒంటిపొరను పిన్ చేసి స్టైల్‌గా చేతిపై నుండి పట్టుకుంటే చాలా ఎలిగెంట్‌గా ఉంటుంది.
ఉద్యోగం చేసేవారు ఇలాంటి ప్రయోగాలు చేయకుండా ఫ్రిల్స్‌సెట్ చేసి పిన్ పెట్టడం మంచిది. ఆఫీసులో ఎలాంటి అన్‌యిజీ లేకుండా ఉండటమేకాకుండా సింపుల్‌గా, అందంగా ఉంటుంది.
శారీపై ఫ్రిల్స్‌ఉన్న పెట్టీకోట్ వాడకూడదు.
కాటన్ శారీ ధరించాలనుకునే వారు స్టార్చ్ పెట్టటం, ఐరన్ చేయటం మరిచిపోవద్దు, ఇలా చేస్తే కాటన్ చీర అందం పెరుగుతుంది. కట్టుకున్న వారికి హుందాతనం వస్తుంది.
చీరకట్టు తెలిసిన వారైతే ఈ చిన్నచిన్న సలహాలు పాటించి అందాన్ని పెంచుకోవచ్చు.
చీరకట్టు తెలిసిన వారైతే ఈ చిన్నచిన్న సలహాలు పాటించి అందాన్ని పెంచుకోవచ్చు.