ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

OLD AGED SPECIAL BISCUITS WITH SALT - EASILY DIGESTIBLE


సాల్ట్ బిస్కెట్స్

కావలసినవి:
మైదా: 1/2 kg
డాల్డా: 1/2 kg
పంచదార: 50 grms(powder)
ఉప్పు: 2 tsp
వాము పొడి: 1 tsp
జీలకర్ర పొడి: 1 tsp
తయారు చేయు విధానము:
1. మైదాలో డాల్డా వేసి కొద్దిగా మృదువుగా మునివేళ్లతో కలిపితే పిండి బ్రెడ్ పొడిలా తయారువుతుంది. ఇందులో పంచదార పొడి, వాము, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీరు చల్లి మృదువుగా కలిపి గాలి చొరబడకుండా అరగంట సేపు ఉంచాలి.
2. ఈ పిండిని దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి గుండ్రని బిళ్లలుగా తయారు చేయాలి. ఇవన్నీ ఒకే సైజులో ఉండేలా చూసుకోవాలి. ఫోర్క తో వాటి మీద అక్కడక్కడా గుచ్చితే బిస్కెట్స్ సమంగా బేక్ అవుతాయి.
3. నూనె లేదా నెయ్యి పూత పూసిన పాత్రలో మధ్యలో అంగుళం దూరం ఉండేటట్లుగా ఈ పిండి బిళ్లలను అమర్చి ఓవెన్ లో 20 నిమిషాల పాటు 350 డిగ్రల ఫారెన్ హీట్ వద్ద బేక్ చేస్తే సరిపోతుంది. ఒవెన్ లేనట్టైతే ఇసుక పోసిన కుక్కర్ లో గానీ పాత్రలో గానీ సుమారు పదినిమిషాలు బేక్ చేయాలి. రుచికరమైన సాల్ట్ బిస్కెట్స్ రెడీ.