వంట చేయాలంటే ముందుగా కావలసింది ఉల్లిపాయలు. ఏ కూరగాయలు లేకుంటే కూడా నేనున్నాగా అంటుంది ఈ ఉల్లిపాయ. ఈసారి ఉత్త ఉల్లిపాయతో కేరళ స్పెషల్ వంటకం చేద్దాం.
ఉల్లి తీయల్ (కేరళ స్పెషల్)
కావలసిన వస్తువులు:
ఉల్లిపాయలు – 6
కొబ్బరి తురుము – 1/4 కప్పు
చింతపండు – నిమ్మకాయంత
కారం పొడి – 1 tsp
ధనియాలపొడి – 1/2 tsp
జీలకర్ర పొడి – 1 tsp
పసుపు – 1/4 tsp
ఆవాలు – 1/4 tsp
ఎండు మిర్చి – 2
ఉప్పు – తగినంత
కరివేపాకు – 2 రెబ్బలు
నూనె – 3 tbsp
ఉల్లిపాయలను పొట్టు తీసి నిలువుగా, సన్నగా కట్ చేసుకోవాలి… చింతపండును కొద్ది నీళ్లలో నానబెట్టి చిక్కటి పులుసు తీసి పెట్టుకోవాలి. ఒక చిన్న గిన్నెలో కొబ్బరి పొడి, కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపాలి. ప్యాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, ఎండుమిర్చి వేసి కొద్దిగా వేపి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయలు బాగా వేగి మెత్తబడేవరకు వేయించాలి. తర్వాత ఇంతకు ముందు కలిపి ఉంచుకున్న పొడుల మిశ్రమం, చింతపండు పులుసు , తగినంత ఉప్పు కొద్దిగా పంచదార వేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి. అవసరమైతే అరకప్పు నీళ్లు కలుపుకోవాలి. ఉల్లిపాయలు పూర్తిగా ఉడికి దగ్గిర పడ్డాక దింపేయాలి.